Tollywood : టాలీవుడ్ లో డూప్స్ కి పెరిగిన డిమాండ్.. భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి..

ఒకప్పుడు హీరోలు స్వయంగా యాక్షన్ సీన్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.

Tollywood : టాలీవుడ్ లో డూప్స్ కి పెరిగిన డిమాండ్.. భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి..

Tollywood Star Heros Prefers Dupes and Body Doubles for Action Scenes

Updated On : June 28, 2025 / 9:02 PM IST

Tollywood : స్టార్ హీరోలకు డూప్‌లు ఉండటం కామన్. వాళ్లు హీరోలకు బదులు రిస్కీ స్టంట్లు చేస్తుంటారు. అప్పుడప్పుడు రియల్‌ హీరోల్లాగా టీవీ షోల్లో హల్‌చల్‌ చేస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోల సినిమాల కంటే వారి డూప్‌ల గురించే టాలీవుడ్‌లో ఎక్కువగా చర్చ నడుస్తోంది.

ఎస్పెషల్‌గా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోలు తమ సినిమాల్లో బాడీ డబుల్స్‌ను ఎక్కువగా వాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు స్టార్ హీరోలు కేవలం క్లోజ్-అప్ షాట్ల కోసం మాత్రమే కెమెరా ముందుకు వస్తున్నారట. యాక్షన్ సీన్స్, వైడ్ షాట్లు, రిస్క్‌తో కూడిన స్టంట్స్‌లో మాత్రం వారి బాడీ డబుల్స్‌తో అంటే డూప్స్‌తో చేయిస్తున్నారని టాక్.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

ఒకప్పుడు హీరోలు స్వయంగా యాక్షన్ సీన్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు, పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో, భారీ బడ్జెట్ చిత్రాల్లో రిస్క్ తీసుకోవడానికి హీరోలు ముందుకు రావడం లేదట. ఒక మీడియం రేంజ్ హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్‌ను బాడీ డబుల్స్‌కు ఇస్తున్నారని, వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

కొందరు స్టార్ హీరోలు, తమ బాడీ డబుల్స్‌తో యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తూ, క్లోజ్ షాట్లలో మాత్రమే తమ ముఖాన్ని చూపిస్తున్నారట. హీరో డూప్‌లు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని కొందరు నిర్మాతలే ఒప్పుకుంటున్నారు. ఇటీవల ఓ స్టార్ హీరో తనకు ఇద్దరు డూప్స్ ని పెట్టుకొని రెండు సినిమాలకు అటు ఇటు తిరుగుతూ, డూప్స్ ని తిప్పుతూ షూట్ చేస్తున్నాడట. ఇది గాసిప్పో లేక రియలో తెలియదు కానీ డూప్స్ హవా అనేది ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌గా మారింది.

Also Read : Puri Jagannadh – Buchibabu Sana : ఈ ఇద్దరి డైరెక్టర్స్ గురించి కామన్ విషయాలు ఏంటో తెలుసా? ఫోటో షేర్ చేసి మరీ బయటపెట్టిన బుచ్చిబాబు..