Raviteja : రవితేజతో ఉన్న గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన రాజా రవీంద్ర.. మందు తాగుతూ ఆ మాట అనడంతో..

టీవల రాజా రవీంద్ర ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవితేజతో ఉన్న గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు. (Raviteja)

  • Published On : March 12, 2026 / 12:51 PM IST

Raviteja

  • రవితేజ – రాజా రవీంద్ర గొడవ
  • ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్
  • గొడవ పై క్లారిటీ ఇచ్చిన రాజా రవీంద్ర

Raviteja : రవితేజ, రాజా రవీంద్ర ఎన్నో ఏళ్ళ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. సినీ పరిశ్రమకు వచ్చిన దగ్గర్నుంచి రవితేజ – రాజా రవీంద్ర మంచి ఫ్రెండ్స్. రవితేజ హీరోగా మారిన సమయంలో అతని డేట్స్, రెమ్యునరేషన్స్ అన్ని రాజా రవీంద్రనే చూసుకునేవాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవ అయిందని, వీళ్ళు మాట్లాడుకోవట్లేదని వార్తలు వచ్చాయి.

రాజా రవీంద్ర రవితేజ మేనేజర్ గా తప్పుకోవడంతో ఇండస్ట్రీ అంతా కూడా వీళ్ళు విడిపోయారు అనే అనుకున్నారు. ఇటీవల రాజా రవీంద్ర ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవితేజతో ఉన్న గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Radhika Sarathkumar : టికెట్ రేట్లపై మాట్లాడుతూ.. స్టార్ హీరోలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాధికా శరత్ కుమార్..

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. రవితేజకు, నాకు ఎలాంటి గొడవ లేదు. ఒక రోజు రాత్రి పూట మేము మందు తాగుతున్నాము. అప్పుడు నువ్వు లేకపోతే నాకు సక్సెస్ లేదు అంటున్నారు అందరు. అందుకే కొన్ని రోజులు నువ్వు లేకుండా సినిమాలు చేద్దామనుకుంటున్నాను అన్నాడు నాతో రవి. ఓకే నీ ఇష్టం అన్నాను. అంతే గొడవేం లేదు. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాడు హీరోగా ఎదిగిపోయాడు. లక్షల నుంచి కోట్లు సంపాదిస్తున్నాడు. నేను మాత్రం ఇంకా అక్కడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాను. నాకు నోటి దూల ఎక్కువ. వాడు హీరో అయినా నేను ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నా. అందుకు ఏమైనా ఇబ్బంది పడ్డాడేమో నాకు తెలీదు. నేను వాడి పక్కన క్లోజ్ గా తిరగడం కొంతమందికి నచ్చలేదు. దాంతో రవితేజ తో ఇలాగే చెప్పినట్టు ఉన్నారు నా గురించి. కానీ నాకు రవితేజ చెప్పింది మాత్రం అదే.

అలా మేనేజర్ గా దూరమయ్యాను కానీ ఫ్రెండ్స్ గా కాదు. నాకు రవి అంటే ఇష్టం. వాడి యాక్టింగ్ ఇష్టం. నేను రవితేజతో యాక్ట్ చేసి చాలా ఏళ్ళు అవుతుంది. వాడి చుట్టూ కొన్ని గ్రహాలు ఉన్నాయి. నేను వెళ్తే వాళ్లకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని నన్ను రానివ్వరు. కానీ నేను, రవి ఇప్పటికి కూడా కలిసి తాగుతాం. కలిసి మాట్లాడుకుంటాం అన్ని బాగున్నాయి. మా ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా రవితేజ తల్లి, భార్య ఇద్దరూ వస్తారు అని తెలిపాడు.

Also Read : Deewana : ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారురా పోరీలు.. ‘దీవాన’ టీజర్ రిలీజ్..

అలాగే ఇటీవల.. వాల్తేరు వీరయ్య సినిమా షూట్ కి నేను, రవి కలిసివెళ్లము. రవితేజ నా మీద చెయ్యి వేసి మాట్లాడుతుంటే చిరంజీవి అన్నయ్య వచ్చి మీ ఇద్దరికీ గొడవ అయింది అన్నారు కదరా అంటే రవితేజే.. వీడితో గొడవేంటి అన్నయ్య అవేం లేవు అని చెప్పినట్టు తెలిపాడు.