Rajamouli : రాజమౌళి చిన్నప్పుడు కృష్ణుడిగా ఓ సినిమాలో నటించాడని తెలుసా? ఏ సినిమా అంటే..

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి చిన్నప్పుడు ఒక సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించినట్లు తెలిపాడు.

Rajamouli acted as Lord Krishna in a Movie at his Childhood Details here

Rajamouli : తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరిగా నిలిచారు. RRR సినిమాతో తన సత్తా ప్రపంచానికి చాటారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఒక డాక్యుమెంటరీ చేసింది.

మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ రాజమౌళి పై ఒక డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, రమా రాజమౌళి, రానా.. ఇలా పలువురు మాట్లాడారు. హాలీవుడ్ డైరెక్టర్స్ రసో బ్రదర్స్, జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి గురించి గొప్పనా చెప్పారు ఈ డాక్యుమెంటరీలో. దీంతో ప్రస్తుతం రాజమౌళి డాక్యుమెంటరీ ట్రెండ్ అవుతుంది. అయితే వీరంతా రాజమౌళి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : Niharika – Pithapuram : డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో నిహారిక.. పిఠాపురంలో నిహారిక సందడి..

ఈ క్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి చిన్నప్పుడు ఒక సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించినట్లు తెలిపాడు. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ కలిసి ‘పిల్లన గ్రోవి’ అనే సినిమాని నిర్మించడం మొదలు పెట్టారు. ఆ సినిమాకి శివశక్తి దత్తా దర్శకుడు. కానీ ఆ సినిమా పలు కారణాలతో ఆగిపోయింది. ఆ సినిమా వీళ్ళకు చాలా నష్టాలనే మిగిల్చింది. రాజమౌళి చిన్నప్పుడు ఈ సినిమా కోసం కృష్ణుడి గెటప్ వేసిన ఫోటోని కూడా డాక్యుమెంటరీలో చూపించారు. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు