Radhe Shyam: ప్రభాస్ కోసం రాజమౌళి, కట్టప్ప వాయిస్ ఓవర్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించని డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Naresh Mannam
- Published On : February 28, 2022 / 04:50 PM IST
Radhe Shyam (1)
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించని డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన Radhe Shyam మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మార్చి 18న అభిమానుల ఆశ తీరబోతుంది. గతంలో ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా మార్చి 2న మరో ట్రైలర్ కూడా వదలనున్నారు. దీంతో అభిమానులకు సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందే పండగ మొదలు కానుంది.
Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మార్చి 2న మరో ట్రైలర్!
కాగా.. పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న Radhe Shyamకు ప్రతి భాషలో ప్రముఖుల వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో ఇప్పటికే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వగా.. కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ వాయిస్ ఇవ్వనున్నారు. ఇక తెలుగులో డార్లింగ్ కు బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన రాజమౌళి అందించనుండగా.. అదే బాహుబలిలో ప్రభాస్ మామగా కట్టప్పగా నటించిన సత్యరాజ్ తమిళంలో వాయిస్ అందించనున్నారు.
Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. ఈ ఐదు అంశాలు గమనించారా?
విదేశీ ప్రేమ కథ నేపథ్యంలో రాబోతున్న Radhe Shyam సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్ లో హీరో నటించడం.. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇదేనని రాధాకృష్ణ ఈ చెప్పారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా Radhe Shyam సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
