Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. ఈ ఐదు అంశాలు గమనించారా?

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.

Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. ఈ ఐదు అంశాలు గమనించారా?

Radhe Shyam (1)

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ కలర్ ఫుల్ వీడియో సాంగ్ కు అనూహ్య స్పందన వస్తుంది. పాటను అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. పాటకి తగ్గట్లే విజువల్ గా సూపర్బ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. విజువల్ ట్రీట్ ఇచ్చిన రొమాంటిక్ లవ్ ట్రాక్ ఈ రాతలే సాంగ్ తెరకెక్కించారు.

Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. విజువల్ ట్రీట్ ఇచ్చిన రొమాంటిక్ లవ్ ట్రాక్!

ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో ఐదు అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పంచ భూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమీ, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీని కాన్సెప్టు ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడం. ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడతాడు. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట గురించి పూర్తిగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న ప్రశంసల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు.

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ. మార్చ్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.