Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. విజువల్ ట్రీట్ ఇచ్చిన రొమాంటిక్ లవ్ ట్రాక్!

రెబల్ స్టార్ ప్రభాస్-పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా వస్తోన్న రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా..

Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. విజువల్ ట్రీట్ ఇచ్చిన రొమాంటిక్ లవ్ ట్రాక్!

Radhe Shyam

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్-పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా వస్తోన్న రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ అటెన్షన్ పెంచే పనిలో పడ్డారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్ ఈ రాతలే వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడ్ పెంచడయ్యా.. మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!

ఈ రాతలే వీడియో సాంగ్ లో ప్రభాస్ రెబల్ స్టార్ నుండి సూపర్ కూల్ స్టార్ గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇక పూజా హెగ్డే గ్లామర్ గురించైతే చెప్పనక్కర్లేదు. మొత్తం మీద ఈ రాతలే వీడియో సాంగ్ ప్రభాస్, పూజా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ మనసులు దోచేసింది. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేయగా.. యువన్ శంకర్ రాజ్, హరిణి ఆలపించారు.

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

ఇప్పటికే పాట సూపర్ హిట్. పాటకి తగ్గట్లే విజువల్ గా సూపర్బ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. విజువల్ ట్రీట్ ఇచ్చిన రొమాంటిక్ లవ్ ట్రాక్ ఈ రాతలే సాంగ్ తెరకెక్కించారు. సినిమాలో పూజా-ప్రభాస్ ల మధ్య ప్రేమ ఎలా పుడుతుందో ఈ పాటను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను ఎంత క్యూట్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించారో.. అంతే ఎమోషన్ ను కూడా చూపించనున్నట్లు దర్శకుడు రాధాకృష్ణ ఈ పాత ద్వారా చెప్పకనే చెప్పాడు.