Rajamouli : రాజమౌళి ఇంట్లో ఆస్కార్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. RRR టీం వాళ్ళు ఎవరికి వాళ్ళు తమ ఫ్యామిలీలు, సన్నిహితులు, స్నేహితులతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆదివారం నాడు కాల భైరవ స్నేహితులతో కలిసి RRR సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చరణ్ RC 15 సెట్ లో RRR ఆస్కార్ సెలబ్రేషన్స్ ని.............

  • Published On : March 20, 2023 / 12:16 PM IST

Rajamouli and keeravani Oscar Success Celebrations in Rajamouli Home with family and friends

Rajamouli :  RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని అంతా ఊపేసి ఆస్కార్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆస్కార్ గెలుచుకొని RRR టీం ఇండియాకు వచ్చింది. ఇండియాలో RRR టీంకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక నాటు నాటు సాంగ్ ని, ఆస్కార్ సాధించడంతో చిత్రయూనిట్ ని అందరూ అభినందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత సినీ అవార్డు సాధించడంతో RRR యూనిట్ ఫుల్ సంతోషంగా ఉంది. ఆల్రెడీ RRR టీం ఆస్కార్ వచ్చిన రోజూ రాత్రే అమెరికాలో టీం అంతా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఇక ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. RRR టీం వాళ్ళు ఎవరికి వాళ్ళు తమ ఫ్యామిలీలు, సన్నిహితులు, స్నేహితులతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆదివారం నాడు కాల భైరవ స్నేహితులతో కలిసి RRR సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చరణ్ RC 15 సెట్ లో RRR ఆస్కార్ సెలబ్రేషన్స్ ని చేసుకున్నాడు. తాజాగా రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు ఆదివారం రాత్రి రాజమౌళి ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Nikhil Siddhartha : నిఖిల్‌కి ఐకానిక్ గోల్డ్ అవార్డ్.. ‘నేషనల్ లెవెల్ బిగ్ స్టార్’ అంటున్న బాలీవుడ్ మీడియా..

రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, సన్నిహితులు, చుట్టుపక్కల ఫ్యామిలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీరవాణి కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. ఆస్కార్ తో వచ్చినందుకు స్వాగతం చెప్తూ, అభినందిస్తూ బ్యానర్స్ కూడా ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. రాజమౌళి ఇంటి సెల్లార్ లో ఈ సెలబ్రేషన్స్ జరిగినట్టు సమాచారం. అనంతరం ఓ చిన్నపాటి పార్టీ కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్కడా బయటకు రాలేదు. కానీ రాజమౌళి ఫ్యామిలీ సన్నిహితుల్లో ఒకరు ఫోన్ తో తీసిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది.