Varanasi: ‘వారణాసి’కి చిన్న విరామం.. మహేష్, ప్రియాంక కూడా వచ్చేశారు

చిన్న విరామం తరువాత మళ్ళీ మొదలైన రాజమౌళి- మహేష్ బాబు వారణాసి(Varanasi) సినిమా షూటింగ్.

Rajamouli and Mahesh Babu Varanasi movie shoot resumed after short break.

  • వారణాసిలో మహేశ్‌ బాబు కొత్త షెడ్యూల్.
  • రాజమౌళి గ్లోబల్ అడ్వెంచర్ షూటింగ్ షురూ.
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌లో భారీ విడుదల.

Varanasi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి నుంచి వస్తున్న భారీ ప్రాజెక్టు ‘వారణాసి(Varanasi)’ కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. చిన్న విరామం తర్వాత మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా వంటి భారీ తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను వారణాసిలో చిత్రీకరించేందుకు చిత్రబృందం సర్వం సిద్ధం చేసింది. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒకవైపు వేగంగా జరుగుతుండగానే, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఇటీవల మెక్సికోలో ప్రమోషన్స్ నిర్వహించిన మేకర్స్, త్వరలోనే ఫ్రాన్స్‌లో కూడా సినిమాను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Mouni Roy-Suraj Nambiar: మూడేళ్ల ప్రేమ, రెండేళ్ల పెళ్లి.. అప్పుడే బ్రేకప్? భర్త ఫోటోలు డిలీట్ చేసిన మౌనీ రాయ్

రామాయణంలోని ముఖ్య ఘట్టాల స్ఫూర్తితో, ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.ఎస్‌.కార్తికేయ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఇటు టాలీవుడ్, అటు హాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రీకరణ వేగాన్ని బట్టి చూస్తే, నిర్ణీత సమయానికే ఈ విజువల్ వండర్ థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.