×
Ad

Mahesh Babu : ట్రైనింగ్ ఇప్పించి మరీ రాజమౌళి నా రన్నింగ్ స్టైల్ మార్చేశారు.. మహేష్ వ్యాఖ్యలు వైరల్.. అసలు బాబుకి అదే హైలెట్ కదా..

రాజమౌళి ఈ సినిమాకు హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. (Mahesh Babu)

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టార్గెట్ గా దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.(Mahesh Babu)

రాజమౌళి ఈ సినిమాకు హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూ రిలీజవ్వగా అందులో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also See : రాజమౌళి ‘వారణాసి’ హాలీవుడ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..

Mahesh Babu

మహేష్ బాబు మాట్లాడుతూ.. రిహార్సిల్స్ కూడా షూట్ చేస్తారు రాజమౌళి. సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకొని మరీ షూట్ చేస్తారు. అందుకే షూటింగ్ లో ఈజీగా ఉంటుంది. ఒక స్టూడియోలో రిహార్సిల్స్ చేసేవాళ్ళం. రాజమౌళి కి ఒక మెథడ్, ప్రాసెస్ ఉంది. నీ క్యారెక్టర్, హావభావాలు అన్ని ఇంపార్టెంట్ అవన్నీ రాజమౌళి దగ్గరుండి చూసుకుంటారు. లాస్ట్ ఇయర్ అంతా దాని మీద వర్క్ చేసాము. రెండు మూడు నెలలు కలరిపయట్టు ట్రైనింగ్ తీసుకున్నాను. నా రన్నింగ్ టెక్నిక్ ని కూడా రాజమౌళి మార్చేశాడు. ట్రాక్ ఫీల్డ్ లో నేను దాని కోసం ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ సినిమాలో అవి రెండే షాట్స్ ఉంటాయి. ఆయన కమిట్మెంట్ అలాంటిది.

షూటింగ్ చాలా ఫన్ గా ఉండేది. సినిమా కోసం వర్క్ చేయడం సరదాగా సాగేది. ఆయన చెప్పినట్టు వాకింగ్, నిలబడినప్పుడు ఎలా ఉండాలి అని కూడా నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేసేవాడ్ని. ఓ సారి మా ఫ్యామిలీతో జర్మనీ ట్రిప్ కి వెళ్తే రోడ్ మీద ప్రాక్టీస్ చేస్తూ నడుస్తున్నా. అక్కడి జనాలు చూసి ఎవరు ఇతను ఇలా చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. ఆ ప్రాక్టీస్ లు అన్ని షూటింగ్ లో బాగా పనికొచ్చాయి. నా నెక్స్ట్ సినిమాకు రిహార్సిల్స్ అడుగుతాను. ఎవరూ రిహార్సిల్స్ చేయరు. రిహార్సిల్స్ చేస్తే షూటింగ్ ఈజీగా ఉంటుంది. యాక్షన్స్ సీక్వెన్స్ లో గాయాలు కూడా తగ్గుతాయి అని తెలిపారు.

Also See : ‘వారణాసి’ హాలీవుడ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..

దీంతో మహేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అసలు మహేష్ బాబు అంటేనే రన్నింగ్ కి స్పెషల్. మహేష్ రన్నింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పోకిరి, మహర్షి, వన్ నేనొక్కడ్నే.. ఇలా చాలా సినిమాల్లో మహేష్ మార్క్ రన్నింగ్ హైలెట్ గా నిలిచాయి. మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ రన్నింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి కూడా అది చాలా ఇష్టం. కానీ రాజమౌళి ట్రైనింగ్ ఇప్పించి మరీ మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చేశాడు అనడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి కొత్త రన్నింగ్ స్టైల్ ఎలా ఉంటుందో, రాజమౌళి మహేష్ ని ఎలా చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.