SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమా టెక్నిషియన్స్ వీళ్లేనా? బాబు కోసం తన టీంలో ఛేంజెస్ చేసిన రాజమౌళి?

ప్రస్తుతం మహేష్ - రాజమౌళి సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణులు వీళ్ళే అని కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి.

Rajamouli Mahesh Babu SSMB 29 Movie Technicians Names goes Viral

Rajamouli – Mahesh Babu : RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంవత్సరంలోనే మహేష్ – రాజమౌళి సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ సినిమా గురించి రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. గత రెండు రోజులుగా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ రాజమౌళి – మహేష్ సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా మహేష్ – రాజమౌళి సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ పేర్లు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రాజమౌళి అన్ని సినిమాలకు చాలా వరకు ఒకే టెక్నిషియన్స్ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, యాక్షన్ కొరియోగ్రాఫర్.. ఇలా చాలా మంది టెక్నిషియన్స్ రాజమౌళికి రెగ్యులర్ గా పని చేస్తారు. కానీ ఈ సినిమా కోసం రాజమౌళి కెమెరామెన్, ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్.. పలువురిని మార్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ – రాజమౌళి సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణులు వీళ్ళే అని కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. SSMB 29 సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా PS వినోద్, సంగీత దర్శకుడిగా MM కీరవాణి, ఎడిటర్ గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ నాథ్ బింగి, VFX సూపర్ వైజర్ గా కమల్ కన్నన్ లు పనిచేయబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, ఆమె టీం వర్క్ చేయబోతున్నారు. మహేష్ సినిమా కోసం రాజమౌళి కొత్త కాంబోలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Rohini : నంది అవార్డు వచ్చినా ఇంతవరకు ఇవ్వలేదు.. నటి రోహిణి సంచలన పోస్ట్..

ఇక ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని గతంలోనే రాజమౌళి చెప్పారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మహేష్ బాబు కూడా కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చారు. త్వరలో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని మొదలుపెట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు