Varanasi : ‘వారణాసి’ టైటిల్ నాదే.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేసాను..

అయితే రాజమౌళి, నిర్మాత KL నారాయణ, వాళ్ళ టీమ్ వారణాసి సినిమా రిజిస్టర్ చేసిన దర్శకుడు సుబ్బారెడ్డితో మాట్లాడారు.(Varanasi)

  • Published on- July 23, 2026 / 02:48 PM IST

Varanasi

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ కానుంది వారణాసి. అయితే ఈ టైటిల్ పై ఓ వివాదం ఉంది. ఆల్రెడీ ఈ టైటిల్ ని వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించారు.

అయితే రాజమౌళి, నిర్మాత KL నారాయణ, వాళ్ళ టీమ్ వారణాసి సినిమా రిజిస్టర్ చేసిన దర్శకుడు సుబ్బారెడ్డితో మాట్లాడారు. దీంతో అతను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే ఆ టైటిల్ ని ఇచ్చేసారు. నేడు దర్శకుడు సుబ్బారెడ్డి నిర్మాత KL నారాయణను కలిసి వారణాసి టైటిల్ రిజిస్ట్రేషన్ పేపర్ ని అందించారు.

Also Read : Jana Nayakudu Review : ‘జన నాయకుడు’ రివ్యూ.. విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉందంటే.. భగవంత్ కేసరి రీమేకేనా?

ఈ సందరభంగా దర్శకుడు సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2023లో ‘వారణాసి’ టైటిల్‌ను నా బ్యానర్‌పై రిజిస్టర్ చేయించి దానికి సంబంధించిన ఆ కథపై పని మొదలుపెట్టాను. అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న ఈ భారీ సినిమాకు టైటిల్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టైటిల్‌ను వ్యాపారంగా చూడలేదు అందుకే ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఆలోచన నాకు రాలేదు. టైటిల్ నాకు ఒక ఎమోషన్. దాన్ని అమ్మడానికి కాదు మంచి సినిమా కోసం ఇవ్వడానికి రెడీ అయ్యాను అని తెలిపారు.