Varanasi : ‘వారణాసి’లో అవన్నీ జస్ట్ విజువల్స్.. ఇది తండ్రి కొడుకుల కథ.. మరి మహేష్ తండ్రి పాత్ర ఎవరు?
తాజాగా రాజమౌళి బాహుబలికి సంబంధించిన ఓ ప్రమోషన్ లో పాల్గొనగా వారణాసి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Varanasi)
- Saketh U
- Published on- June 28, 2026 / 12:16 PM IST
Varanasi
Varanasi : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెల్సిందే. ఆల్మోస్ట్ 800 కోట్ల భారీ బ్యాగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 2027 ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. తాజాగా రాజమౌళి బాహుబలికి సంబంధించిన ఓ ప్రమోషన్ లో పాల్గొనగా వారణాసి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అయితే ఇప్పటివరకు వారణాసి సినిమా.. రెండు టైం లైన్స్ లో జరిగేదని, రామాయణానికి ప్రస్తుత కాలానికి లింక్ పెడుతూ ఆఫ్రికా, అంటార్కిటికాలలో కూడా కథ నడిపిస్తూ, ట్రెజర్ హంట్ లా ఓ విజువల్ వండర్ లా, ఫాంటసీ కథగా, అడ్వెంచరస్ డ్రామాగా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టే టైటిల్ టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. అయితే తాజాగా రాజమౌళి ఇందులో అడ్వెంచరస్, విజువల్స్ ఉన్నా ఈ సినిమాలో మెయిన్ థీమ్ తండ్రి కొడుకుల ఎమోషన్, కుటుంబ భావోద్వేగాలు అని తెలిపారు.
Also Read : Samantha : సమంత నిజంగా టీవీఎస్ తోలలేదా.. ‘మా ఇంటి బంగారం’ మేకింగ్ వీడియో వైరల్..
దీంతో వారణాసి సినిమా తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం అని తెలుస్తుంది. ఆ పోరాటంలో భాగంగానే ఇవన్నీ దాటుకుంటూ వెళ్తాడని టైటిల్ టీజర్ బట్టి అంచనాలు వేస్తున్నారు. తండ్రి కొడుకుల కథ అయితే ఇందులో మహేష్ బాబు తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరి ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తారా లేక ఇంకెవరైనా నటిస్తున్నారా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
