Rajamouli
Rajamouli : ఇటీవల వచ్చే సినిమాలకు విజువల్స్ భారీగా ఉండటంతో CGలు, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఎక్కువగా అవసరం అవుతున్నాయి. దీనికోసం హాలీవుడ్ స్టూడియోలకు వెళ్లాల్సి వస్తుంది. మన దగ్గర మోషన్ క్యాప్చర్ షూట్ చేసేందుకు లేదు. దీంతో కొన్ని సినిమాలు హాలీవుడ్ స్టూడియోలకు వెళ్లి చేస్తున్నాయి.
ఈ క్రమంలో నాగార్జున, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ హాలీవుడ్ స్టూడియోలు యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్, ఏ అండ్ ఎం మోషన్ క్యాప్చర్ ల్యాబ్ కలిసి ఇక్కడ మన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ని స్థాపించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీగా ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ని నిర్మించారు. ఇందుకు కావాల్సిన సాంకేతికత అంతా తీసుకొచ్చారు. రాజమౌళి దీన్ని ఆవిష్కరించారు ఇటీవల.
Also Read : Shivam Dube : మహేష్ బాబు పై టీమ్ ఇండియా ఆల్ రౌండర్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నాడంటే..
తాజాగా ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ గురించి రాజమౌళి, నాగార్జున, శోభు.. మాట్లాడుతూ, అక్కడ మోషన్ క్యాప్చర్ లో షూటింగ్ ఎలా చేసారు అని చూపిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేసారు.
ఈ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి, ఈగ సినిమాలు చేస్తున్నప్పుడు మన దగ్గర మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే బాగుండేదని అనుకున్నాను. ఇప్పుడు ఆ టెక్నాలజీ అన్నపూర్ణ స్టూడియోలోనే అందుబాటులోకి వచ్చింది. ఆల్రెడీ వారణాసి సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడి కొన్ని సీన్స్ షూటింగ్ చేశాను. అవి అద్భుతంగా వచ్చాయి అని అన్నారు. దీంతో అన్నపూర్ణ స్టూడియోలో అన్ని సినీ పరిశ్రమల వాళ్ళు ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కోసం వస్తారని తెలుస్తుంది.
Also See : Anjana Yelavarthy : నాని బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన భార్య..