Varanasi: గ్లోబల్ స్టేజ్‌పై ‘వారణాసి’.. మెక్సికో ఫస్ట్ లో ‘వారణాసి టు ద వరల్డ్’.. స్పెషల్ గ్లింప్స్‌ తో భారీ హైప్

కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ 2026 థండర్ స్టేజ్‌పై వారణాసి(Varanas) టు ద వరల్డ్ పేరుతో సినిమా గ్లింప్స్‌ను భారీ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు మేకర్స్

rajamouli VARANASI global appearance at Comic Con Experience 2026

  • అంతర్జాతీయ వేదికపై రాజమౌళి వారణాసి
  • కామిక్ కాన్ వేదికపై నుంచి ‘వారణాసి టు ద వరల్డ్’
  • స్పెషల్ గ్లింప్స్‌ తో భారీ ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్న మేకర్స్

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (Varanasi) అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మెక్సికోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘CCXP 2026’ (Comic Con Experience) ఈవెంట్‌లో ఏప్రిల్ 24న ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. “వారణాసి టు ద వరల్డ్” పేరుతో సినిమా గ్లింప్స్‌ను థండర్ స్టేజ్‌పై భారీ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేసిన ఈ గ్లోబల్ ప్రమోషన్లతో మెగా ప్రాజెక్ట్ అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

Darling Re-Release: ఇది పిచ్చికి పీక్స్ భయ్యా.. డార్లింగ్ రీ రిలీజ్.. ‘ఇంకా ఎదో’ సాంగ్ రీ క్రియేషన్ వీడియో వైరల్

ఈ వేడుకలో భాగంగా రాజమౌళి నుండి ఒక ప్రత్యేక వీడియో సందేశంతో పాటు, ఇంతకుముందెన్నడూ చూడని వారణాసి ‘బిహైండ్ ద సీన్స్’ (BTS) వీడియోలను అక్కడ ఉన్న ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఒక భారతీయ చిత్రం ఈ స్థాయిలో మెక్సికోలో సందడి చేయడం ఇదే మొదటిసారి.

ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోందని ఈ ఈవెంట్ ద్వారా స్పష్టమవుతోంది. ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రంపై రాజమౌళి తనదైన ముద్ర వేయబోతున్నారు. ఇప్పటికే పారిస్ వంటి చోట్ల గ్లింప్స్ విడుదల చేసి విదేశీ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచిన మేకర్స్, ఇప్పుడు మెక్సికో వేదికగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది.