×
Ad

Nidhhi Agerwal : పెళ్ళికి ముందే పిల్లలు కావాలి అనుకున్నా.. కానీ.. రాజాసాబ్ భామ కామెంట్స్ వైరల్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిధి అగర్వాల్. (Nidhhi Agerwal)

Nidhhi Agerwal

Nidhhi Agerwal : ఇటీవలే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిధి అగర్వాల్. చేసింది తక్కువ సినిమాలైనా బాగానే ఫేమ్ తెచ్చుకుంది నిధి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోజులతో వైరల్ అవుతూనే ఉంటుంది. రాజాసాబ్ రిలీజ్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది నిధి అగర్వాల్.(Nidhhi Agerwal)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిధి అగర్వాల్.

Also Read : Anil Ravipudi : మన శంకర వరప్రసాద్ గారు సినిమా.. పిల్లలని దూరంగా ఉంచండి.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్..

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నా పెళ్ళికి చాలా టైం ఉంది. కానీ పిల్లలు మాత్రం కావాలి. నాకు కనీసం నలుగురు పిల్లలు కావాలి. నేను పిల్లల గురించి రెగ్యులర్ గా ఆలోచిస్తాను. పెళ్లి కంటే ముందే పిల్లల్ని దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ పిల్లల్ని పెంచాలంటే మనం మరో ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడదు.

నాకు చిన్నప్పట్నుంచి పిల్లలు అంటే ఇష్టం. మా పేరెంట్స్ నేను పుట్టాక ఒక పాప చాలు అనుకున్నారు. కానీ నాకు చెల్లి కావాలని దేవుడి దగ్గర ఉత్తరం రాసి పెట్టేదాన్ని. నేను పుట్టిన ఏడేళ్ల తర్వాత నాకు చెల్లి పుట్టింది. తనను చెల్లిలా కాకుండా కూతురిలా చూసుకుంటాను అని తెలిపింది.

Also Read : Pawan Kalyan : కోటప్పకొండ ఆలయంలో పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..