Rajeev Kanakala : గుప్త దానాలు చేసింది.. భార్య గురించి మాట్లాడుతూ స్టేజిపై రాజీవ్ ఎమోషనల్.. ఏడ్చేసిన యాంకర్ సుమ

సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఆమె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. (Rajeev Kanakala)

  • Published on- October 24, 2026 / 03:40 PM IST

Rajeev Kanakala

Rajeev Kanakala : యాంకర్ సుమ ఓ పక్కన టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, యూట్యూబ్ తో బిజీగానే ఉంటూనే మరో పక్క సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఫెస్టివల్ ఫర్ జాయిస్ అనే సంస్థ పేరిట అనాధలు, వృద్ధాశ్రమాలలో వృద్దులు, దివ్యంగులు ఉండే ఆశ్రమాల్లో పండగలు చేసుకోలేని వారి కోసం సపోర్ట్ చేస్తూ వారికి కూడా పండగ ఆనందాన్ని పంచుతుంది సుమ. ఈ సంస్థ ప్రారంభమై ఐదేళ్లు కావడంతో నేడు స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ ఈవెంట్లో సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఆమె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దీంతో సుమ కూడా ఏడ్చేసింది.

Also Read : Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ తన ఇంటికి ఏం పేరు పెట్టుకుందో తెలుసా? సొంతిల్లు బ్యాక్ స్టోరీ..

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. సుమ జర్నీ మాములు జర్నీ కాదు. చాలా దృఢ నిశ్చయంతో తన ప్రొఫెషనల్ లైఫ్ , పర్సనల్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడానికి కారణం నాలాంటి వాడ్ని భరించడమే. ఫెస్టివల్ ఫర్ జాయిస్ అయిదేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించినా అంతకు ముందే ఎప్పట్నుంచో సేవలు చేస్తుంది. నా పెళ్లయిన రెండు మూడేళ్ళ నుంచే సేవలు చేస్తుంది. చాలా గుప్త దానాలు చేసింది. పండగలు చేసుకోలేని వారికి మనలాగా పండగలు చేసుకోవాలి అని ఈ సంస్థ మొదలుపెట్టింది.

ఇవి చేయడానికి వెనక మేము ఉన్నా మేము పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఆమె మమ్మల్ని సపోర్ట్ చేసింది. తన చుట్టూ ఉన్నవాళ్ళని సపోర్ట్ చేసింది. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా నూట పదహారేళ్లు బతుకుతావు నువ్వు ఇలాంటి సర్వీస్ చేయడానికి అని మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజీవ్. చివర్లో లవ్ యు అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also See : Satya Sri : పోలీస్ డ్రెస్‌లో జబర్దస్త్ సత్యశ్రీ.. నా వైఫ్ మిస్సింగ్ వర్కింగ్ స్టిల్స్..

రాజీవ్ తన భార్య సుమ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడంతో సుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్ అయ్యాక సుమ స్టేజిపైకి వెళ్లి రాజీవ్ ని దగ్గరుండి తీసుకొచ్చింది.