Nenevaru : ‘నేనెవరు’ అంటున్న రాజేంద్రప్రసాద్..

'నేనెవరు?' సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. (Nenevaru)

  • Published on- May 26, 2026 / 02:45 PM IST

Nenevaru

Nenevaru : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ లో సాయికిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా నేనెవరు. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనెవరు?’ సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇప్పటికే పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌ రిలీజయి ప్రేక్షకుల ఆదరణ లభించగా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ మెసేజ్ కూడా చెప్తూ సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో అదరగొట్టారని సమాచారం.

Also See : Sekhar Master: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని, ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా నేనెవరు? అనే టైటిల్‌కు తగ్గట్టు ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేశామని, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంటుందని మూవీ యూనిట్ తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రీమియర్ షో వేయగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.