×
Ad

Vettaiyan : అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లో ఎవరికి పోటీ..!

అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఒకరి మీద అయ్యేలా కనిపిస్తుంది.

  • Published On : April 7, 2024 / 04:31 PM IST

Rajinikanth Amitabh Bachchan Vettaiyan movie release date update

Vettaiyan : జై భీం డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన 170వ సినిమా ‘వెట్టియాన్’ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్.. వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు నేడు అనౌన్స్ చేశారు. అయితే కచ్చితమైన డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. అక్టోబర్ లో రెండు పండగలు ఉన్నాయి. అక్టోబర్ స్టార్టింగ్ లో దసరా ఉంటే.. చివరి రోజులో దీవాళీ ఉంది. ఈ రెండు పండగల్లో రజినీకాంత్ ఎప్పుడు రాబోతున్నారో అన్నది తెలియాల్సి ఉంది. కాగా దసరాకి వచ్చేందుకు ఎన్టీఆర్ ‘దేవర’ డేట్ ఫిక్స్ చేసుకొని కూర్చొంది. ఇక దీవాళీ పండక్కి వచ్చేందుకు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న టాక్.

Also read : Pushpa 2 Teaser : పుష్ప 2 టీజర్ రేపు ఆ టైంకి రిలీజ్ కాబోతుంది.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

కొరటాల శివ, ఎన్టీఆర్ ‘దేవర’ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ని అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ నిర్మాత దిల్ రాజు డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ రెండు పండగల్లో రజినీకాంత్ ఏ పండక్కి వస్తారో..? చరణ్, ఎన్టీఆర్ లో ఎవరి మీద ఎటాక్ కి సిద్దమవుతున్నారో చూడాలి.