Rajinikanth- Nani: రజనీకాంత్ అయితే ఏంటి? ‘ది ప్యారడైజ్’ను పోటీకి దించుతున్న నాని
ఒకే సమయంలో విడుదల కానున్న జైలర్ 2 అండ్ ది ప్యారడైజ్ సినిమాలు(Rajinikanth v/s Nani).
- V Santhosh Kumar
- Updated on- May 23, 2026 / 02:48 PM IST
jailer 2 and the paradise movie releasing at same month
- జైలర్ 2, ప్యారడైజ్ ఆగస్టులో విడుదల.
- రజనీకాంత్ నానిల మధ్య తీవ్రపోటీ.
- బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల రేసు.
Rajinikanth-Nani: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ ఎంత బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ వస్తున్న విషయం కూడా తెలిసిందే. మొదటి భాగం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో, ఈ సీక్వెల్‌పై మేకర్స్ తో సహా ఆడియన్స్ కూడా ఒక రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాదు, ప్రెజెంట్ రజనీకాంత్ (Rajinikanth-Nani)కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారనుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Gouri Kishan: యెల్లో డ్రెస్‌లో ’96’ బ్యూటీ రచ్చ.. గౌరి కిషన్ గ్లామర్ ట్రీట్‌కు ఫ్యాన్స్ ఫిదా
మరోవైపు, నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ప్యారడైజ్’. డిఫరెంట్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,. సాంగ్స్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో, ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు జైలర్, ప్యారడైజ్ సినిమాలి దాదాపు ఒకే సమయంలోనే, ఆగస్టు నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్, నాని చిత్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనబోతోంది. నిజానికి, రజనీకాంత్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం, అలాగే, నాని ‘ప్యారడైజ్’ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో అఖండమైన అంచనాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు రేసులో నిలిచిన ఈ ఇద్దరు హీరోలలో ఎవరు విజేతగా నిలుస్తారు, ఏ చిత్రం సక్సెస్ ఫుల్‌గా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరి బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
