Kamal- Rajini: తలైవాను తక్కువ చేశారు.. కమల్‌కు రూ.220 కోట్లు రెమ్యునరేషన్.. రజనీకి మరీ అంత తక్కువా?
కమల్ హాసన్ తో చేస్తున్న సినిమా కోసం రజనీకాంత్(Kamal- Rajini) కి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 7, 2026 / 08:46 PM IST
Rajinikanth getting low remuneration for kamal haasan movie
- రజనీ కంటే కమల్‌కే భారీ పారితోషికం.
- ఇద్దరు హీరోలకే రూ.400 కోట్లు.
- బడ్జెట్ లెక్కల్లో రజనీకి అన్యాయం?
Kamal- Rajini: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ అద్భుత కలయికలో సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దాదాపు రూ.600 నుండి రూ.700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. ఈ మెగా మల్టీస్టారర్ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఈ సినిమా కోసం కమల్ హాసన్ అండ్ రజినీకాంత్(Kamal- Rajini) తీసుకుంటున్న పారితోషికాలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రం కోసం దాదాపు రూ.200 నుండి రూ.220 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.180 నుండి రూ.200 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న నెల్సన్ దిలీప్ కుమార్ కు సుమారు రూ.70 కోట్ల రూపాయల పారితోషికం ఖరారైందని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ లో మిగిలిన భాగాన్ని సినిమా నిర్మాణ వ్యయం, ఇతర నటీనటుల వేతనాల కోసం వెచ్చించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాణ సంస్థ కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇద్దరు అగ్ర హీరోల డేట్స్ సర్దుబాటు చేయడంతో పాటు, సాంకేతికంగా సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో #KHxRK ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది, అభిమానులు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
