Jailer : అమెరికా టైమ్స్ స్క్వేర్‌ను స్వాధీనం చేసుకున్న సూప‌ర్‌స్టార్.. న్యూయార్క్‌లో జైల‌ర్ జ్వ‌రం..

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న సినిమా ‘జైలర్’(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌.

Rajinikanth Jailer

Jailer-Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న సినిమా ‘జైలర్’(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ (Mohanlal), నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్టు 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్టులుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెద్ద ఎత్తున పెంచేశాయి.

Adah Sharma : సినిమాల‌కు అదాశ‌ర్మ విరామం..! త‌న ఆరోగ్యంపై సోష‌ల్ మీడియాలో పోస్ట్‌..

ఇదిలా ఉంటే.. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్క‌డి బిల్ బోర్డుపై ర‌జినీకాంత్ కొత్త చిత్రం జైల‌ర్ సినిమా వీడియోను ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ #జైలర్ జ్వరం న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌ను ఆక్రమించింది అంటూ రాసుకొచ్చింది. ఆ వీడియోలో ర‌జినీకాంత్‌ను పెద్ద తెర‌పై చూసి అభిమానులు ర‌చ్చ చేయ‌డాన్ని చూడొచ్చు.

బ‌డ్జెట్‌లో స‌గం సూప‌ర్ స్టార్‌కే..?

జైల‌ర్ సినిమాను రూ.225కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. కాగా.. ఇందులో న‌టించిన న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాకు ర‌జినీకాంత్ రూ.100 నుంచి రూ.110కోట్లు తీసుకున్నార‌ట‌. 15 నిమిషాల నిడివి ఉన్న పాత్ర‌లో యాక్ట్ చేసిన మోహ‌న్‌లాల్ కు రూ.8కోట్లు, జాకీ ష్రాఫ్ రూ.4కోట్లు, శివ‌రాజ్ కుమార్ రూ.4కోట్లు, హీరోయిన్ త‌మ‌న్నా రూ.3కోట్లు, ర‌మ్య‌కృష్ణ రూ.80ల‌క్ష‌లు పారితోషికంగా తీసుకున్నార‌ని ఆ వార్త సారాంశం. మ‌రీ ఈ వార్త‌లో ఎంత నిజం ఉన్న‌ది అన్న‌ది తెలియాల్సి ఉంది.

Rage Of Bhola Lyrical : భోళా శంకర్ నుంచి స్పెషల్ ర్యాప్ సాంగ్ వచ్చేసింది

ట్రెండింగ్ వార్తలు