×
Ad

Jailer : రజినీకాంత్ ‘జైలర్’ సినిమాపై కోర్టులో పిటిషన్.. టైటిల్ నాది అంటున్న మలయాళం డైరెక్టర్..

ప్రస్తుతం జైలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే తాజాగా జైలర్ సినిమా ఓ వివాదంలో ఇరుక్కుంది.

  • Published On : July 16, 2023 / 08:32 PM IST

Rajinikanth Jailer Movie in Issue Malayalam Director file a petition in court on Jailer title

Jailer Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్’(Jailer). డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప్రస్తుతం జైలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే తాజాగా జైలర్ సినిమా ఓ వివాదంలో ఇరుక్కుంది. మలయాళం డైరెక్టర్ సక్కిర్ మడతిల్ జైలర్ సినిమాపై కేసు వేశాడు. అదే జైలర్ టైటిల్ ని తాను 2021 లోనే కేరళ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించానని, ఆ సినిమా షూటింగ్ కూడా అయిపోయిందని, సినిమా టైటిల్ ని కమల్ హాసన్ వచ్చి లాంచ్ చేశారని తెలిపాడు.

Madhavan : ఏకంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్, మోదీలతో సెల్ఫీ తీసుకున్న మాధవన్.. మోదీ ఫ్రాన్స్ టూర్‌లో మాధవన్ స్పెషల్ అట్రాక్షన్..

రజినీకాంత్ జైలర్ టైటిల్ ని మార్చాలంటూ చిత్రయూనిట్ ని కోరగా వాళ్ళు స్పందించకపోవడంతో మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశాడు మలయాళం డైరెక్టర్. ఆగస్టు 2న ఈ పిటిషన్ హియరింగ్ కి రానుంది. దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే రెండు వేరు వేరు భాషల్లో సినిమాలు కాబట్టి కోర్టు ఈ పిటిషన్ కొట్టేస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. లేదా రజినీకాంత్ స్టార్ హీరో కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే లేదా డబ్బులతో ఈ వివాదం సెటిల్ అయిపోతుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.