Jailer : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్’(Jailer). బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
Adah Sharma : ప్రమోషన్లో అస్వస్థతకు గురైన అదా శర్మ.. వెంటనే హాస్పిటల్కి తరలింపు..
ట్రైలర్ చూస్తుంటే ఒక జైలర్ అయిన రజినీకాంత్ ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్ జీవితాన్ని గడుతుంటాడు. తనలోని యాక్షన్ వ్యక్తిని ఇంటిలో వాళ్ళకి కూడా చూపించకుండా చాలా సైలెంట్ గా ఉన్న హీరో లైఫ్ లోకి విలన్ ఎంట్రీ ఇస్తే.. ఆ తరువాత కుటుంబం కోసం ఆ ఫ్యామిలీ మ్యాన్ జరిపే యుద్ధమే జైలర్ కథ అని తెలుస్తుంది. ఈ మూవీలో రజినీకి భార్యగా రమ్యకృష్ణ నటిస్తుంది. జాకీ ష్రాఫ్ విలన్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ అయితే యాక్షన్ పార్ట్ తో ఆకట్టుకునేలా ఉంది.
అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘కావాలా’ సాంగ్ యూట్యూబ్ లో ఒక ఊపు ఊపుతుంది. రజినీ అభిమానులు ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రోబో సినిమా తరువాత మళ్ళీ సరైన హిట్టు పడలేదు. మధ్యలో 2.0 వచ్చినా ఆడియన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఒక సాలిడ్ హిట్టు కోసం తలైవా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ వారి ఆశని తీరుస్తుందా? లేదా? చూడాలి.