Rajinikanth : ఛ.. రజినీకాంత్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదే జరిగుంటే సీఎం అయ్యేవారా?
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడుకు సీఎం కాబోతున్నారు. (Rajinikanth)
- Saketh U
- Updated on- May 6, 2026 / 09:26 AM IST
Rajinikanth
Rajinikanth : తమిళనాడు ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ పెట్టిన TVK పార్టీ భారీ విజయం సాధించింది. ఏకంగా 108 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ కోసం ముందు నుంచి ప్రిపేర్ చేసుకున్నా అధికారికంగా పార్టీ పెట్టి కేవలం రెండేళ్లే అవుతుంది. రెండేళ్లలోనే విజయ్ తక్కువ ప్రచారంతోనే ఈ రేంజ్ లో సీట్లు గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే అధికారానికి ఇంకో పది సీట్లు కావాలి. వేరే పార్టీల సహకారంతో విజయ్ సీఎం కాబోతున్నారు.
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడుకు సీఎం కాబోతున్నారు. అయితే ఈ ఛాన్స్ ని రజినీకాంత్ మిస్ చేసుకున్నారని అభిమానులు, విశ్లేషకులు అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు తప్ప ఇంకో పార్టీ లేదు. అక్కడ బలమైన మూడో పార్టీకి అవకాశం ఉంది. మధ్యలో కమల్ హాసన్, విజయ్ కాంత్, మరికొంతమంది పార్టీలు పెట్టిన వాళ్ళ రేంజ్ కి గెలిచే అవకాశం లేదు. ఆ పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. కమల్ హాసన్ అయితే ఒక్క సీట్ కూడా గెలవకపోవడం గమనార్హం.
Also Read : Tollywood Actress : తల్లితో గొడవపడిన హీరోయిన్.. ఫ్లాప్స్ కి తల్లే కారణం..? అయినా కూడా..
అయితే గతంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని అధికారికంగానే ప్రకటించారు. ఓ మూడు నాలుగేళ్ళ క్రితం తమిళనాడు లోని తన అభిమాన సంఘాలను ఇంటికి పిలిచి మాట్లాడారు కూడా. ఆ సమయంలో రజినీకాంత్ పార్టీ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఏమనుకున్నారో ఏమో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆ సమయంలో రజినీకాంత్ ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 75 ఏళ్ళు. పెరుగుతున్న ఏజ్, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయాల్లోకి వస్తే ఈ ఏజ్ లో, ఇంత స్టార్ డమ్ తో విమర్శలు ఎదుర్కోవడం పై ఆలోచించి రజినీకాంత్ పార్టీ పెట్టాలనే ఆలోచన విరమించుకున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
Rajinikanth
రజినీకాంత్ కి విజయ్ కన్నా ఎక్కువ స్టార్ డమ్ ఉంది. సినిమాల పరంగా విజయ్ కి కేవలం యూత్ లోనే ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ కి యూత్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ కి బయట రాష్ట్రాల్లో, దేశమంతా, మలేషియా, సింగపూర్, జపాన్, దుబాయ్, అమెరికా.. ఇలా పలు దేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Also Read : Sathyaraj : విజయ్ గెలిచినా నా సపోర్ట్ డీఎంకే పార్టీకే.. కట్టప్ప కామెంట్స్ వైరల్..
తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఒకవేళ జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రజినీకాంత్ పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా భారీగా గెలిచి సీఎం అయ్యేవారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలా సీఎం అయ్యే ఛాన్స్ రజినీకాంత్ మిస్ చేసుకున్నారని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులని పసిగట్టి, అక్కడ మూడో పార్టీకి ఛాన్స్ ఉందని గ్రహించి విజయ్ పార్టీ పెట్టి, తన స్టార్ డమ్ ని కూడా ఉపయోగించి ఇప్పుడు గెలిచారు. సీఎం కాబోతున్నారు.
