Tollywood Actress : తల్లితో గొడవపడిన హీరోయిన్.. ఫ్లాప్స్ కి తల్లే కారణం..? అయినా కూడా..
కొంతమంది అయితే తమ కూతుళ్ళ రెమ్యునరేషన్స్, డేట్స్ కూడా చూసుకుంటారు. (Tollywood Actress)
Tollywood Actress
Tollywood Actress : తాజాగా ఓ హీరోయిన్ తన తల్లితో గొడవపడిందని టాలీవుడ్ సమాచారం. సాధారణంగా హీరోయిన్స్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ పక్కనే ఉంటారు. హీరోయిన్ తల్లి కూడా హీరోయిన్ తో పాటు వస్తుంది ఎక్కడికి వెళ్లినా. చాలా మంది హీరోయిన్స్ విషయంలో ఇది జరుగుతుంది. కొంతమంది అయితే తమ కూతుళ్ళ రెమ్యునరేషన్స్, డేట్స్ కూడా చూసుకుంటారు.
అయితే ఈ హీరోయిన్ తల్లి అయితే కథలు కూడా తానే ఎంపిక చేసి హీరోయిన్ తో అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టించి సినిమాలు చేయించిందట. కొన్ని కథలు అయితే హీరోయిన్ కి చెప్పకుండానే ఓకే చేసి సినిమాలు చేయించిందంట. దీంతో ఆ సినిమాలు కాస్తా ఫ్లాప్ అయ్యాయి. అలా మొదట్లో హిట్స్ కొట్టిన ఆ హీరోయిన్ కి ఆ తర్వాత అన్ని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి.
Also See : Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య విరూప బర్త్ డే.. స్పెషల్ ఫొటోలు..
దీంతో ఈ విషయం హీరోయిన్ కి తెలిసి తన తల్లితో పెద్ద గొడవ పెట్టుకుందట. ఇకపై తన కథలు తానే ఎంపిక చేసుకుంటాను అని ఖరాఖండిగా తల్లికి చెప్పిందట హీరోయిన్. అలాగే సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న ఓ వ్యక్తిని కూడా తనకు వచ్చే కథలను వినడానికి ఆ హీరోయిన్ పెట్టుకున్నట్టు సమాచారం. అయితే కథలు ఎంపిక ఆ హీరోయిన్ చేతిలోకి వెళ్లినా రెమ్యునరేషన్, డేట్స్ విషయం మాత్రం ఇంకా తల్లి చేతిలోనే ఉందట.
ఫ్లాప్స్ లో ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గట్లేదు హీరోయిన్ తల్లి. మరోవైపు ఎడాపెడా యాడ్స్ కూడా చేయించేస్తుంది ఆ హీరోయిన్ తో. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. మరీ ఇంత కంట్రోలింగ్ ఉంటే హీరోయిన్ కి కెరీర్లో కష్టమే అనుకుంటున్నారు. అయితే ఆ హీరోయిన్ శ్రీలీల అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Sathyaraj : విజయ్ గెలిచినా నా సపోర్ట్ డీఎంకే పార్టీకే.. కట్టప్ప కామెంట్స్ వైరల్..
