Rajinikanth : అదిరిపోయిన రజినీకాంత్ న్యూ లుక్.. 72 ఏళ్ళ వయసులో తలైవర్ 170 కోసం..
రజినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.
- Saketh U
- Published on- October 7, 2023 / 03:29 PM IST
Rajinikanth New Look From Thalaivar 170 Movie Shoot goes Viral
Rajinikanth New Look : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ సినిమాతో ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో సంక్రాంతికి లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ తో రాబోతున్నారు. ఇక ఇటీవల తలైవర్ 170 సినిమా అనౌన్స్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
రజినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించగా ఇందులో మంజూ వారియర్ (Manju Warrier), రితికా సింగ్ (Ritika Singh), దుషారా విజయన్ (Dushara Vijayan), రానా దగ్గుబాటి(Rana Daggubati), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.
Also Read : Varun Lavanya Pre Wedding Celebrations : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..
తాజాగా తలైవర్ 170 నుంచి కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. దీంట్లో రజినీకాంత్ సరికొత్త లుక్ లో అదిరిపోయారు. షూటింగ్ వద్దకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తున్న కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. వీటిల్లో రజినీకాంత్ యంగ్ గా కనిపిస్తున్నారు. 72 ఏళ్ళ వయసులో ఇంకా ఇంత యంగ్ గా కనిపిస్తూ వరుస సినిమాలు చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. తలైవర్ 170 కొత్త లుక్ మాత్రం అదిరిపోయింది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
