థియేటరే పెళ్ళి మండపం

రజినీ అభిమాని ఒకతను పెట్టా సినిమా ఆడుతున్న థియేటర్ ఆవరణలోనే పెళ్ళి చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది.

  • Publish Date - January 10, 2019 / 11:52 AM IST

రజినీ అభిమాని ఒకతను పెట్టా సినిమా ఆడుతున్న థియేటర్ ఆవరణలోనే పెళ్ళి చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించగా, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మించిన సినిమా, పెట్టా.. తమిళనాట సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి10) భారీగా రిలీజ్ అయిన పెట్టాకి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే, రజినీ అభిమాని ఒకతను పెట్టా సినిమా ఆడుతున్న థియేటర్ ఆవరణలోనే పెళ్ళి చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, తమిళనాడుకు చెందిన అంబసు, కమాచి అనే యువతీ యువకులిద్దరూ రజీనీకి వీరాభిమానులు. తమ పెళ్ళికి, తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజునే ముహూర్తంగా ఎంచుకుని, పెట్టా సినిమా ఆడుతున్న ఉడ్‌లాండ్స్ థియేటర్ ఆవరణని కళ్యాణ మండపంలా డెకరేట్ చేసి, వేద మంత్రాలు, తోటి తలైవా అభిమానుల ఆశీర్వాదాలతో ఒక్కటయ్యారు. పెళ్ళి తర్వాత అభిమానులందరికీ అక్కడే భోజనాలు కూడా పెట్టారు. థియేటర్ దగ్గర పెళ్ళి చేసుకుని, అంబసు, కమాచి దంపతులు రజినీ అంటే తమకెంత అభిమానమో తెలియచేసారు.