Sasivadane : అమ్మాయి కోసం వెతికేస్తున్న హీరో.. ‘శశివదనే’ నుంచి కొత్త సాంగ్ విన్నారా?

హీరోయిన్ కోసం వెతికే ఈ సాంగ్ ని వినేయండి.

Sasivadane Song : ‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్(Komalee Prasad) జంటగా సాయి మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శశివదనే. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ, అభిలాష్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గోదావరి నేపథ్యంలో లవ్, యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న శశివదనే సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.

Also Read : Thalaivar 171 : తలైవర్ 171 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టైటిల్ రిలీజ్ అప్పుడే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో..?

ఇప్పటికే శశివదనే సినిమా నుంచి టీజర్, రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా నుంచి ‘గోదారి అటు వైపో నాదారి ఇటు వైపో..’ అంటూ సాగే మెలోడీ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో.. హీరోయిన్ కోసం తెగ వెతికేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ పాటని కిట్టు విస్సా ప్రగడ రాయగా అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ తానే స్వయంగా పాడాడు. మీరు కూడా హీరోయిన్ కోసం వెతికే ఈ సాంగ్ ని వినేయండి.

 

ట్రెండింగ్ వార్తలు