Thalaivar 171 : తలైవర్ 171 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టైటిల్ రిలీజ్ అప్పుడే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో..?

తాజాగా నేడు రజినీకాంత్ - లోకేష్ తలైవర్ 171వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Thalaivar 171 : తలైవర్ 171 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టైటిల్ రిలీజ్ అప్పుడే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో..?

Rajinikanth Lokesh Kanagaraj Thalaivar 171 First Look Released Title Announcement Date Revealed

Thalaivar 171 : రజినీకాంత్(Rajinikanth) గత సంవత్సరం జైలర్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. జైలర్ సినిమాతో రజినీకాంత్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత తన 170వ సినిమా వెట్టియాన్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే రజిని అభిమానులతో పాటు అందరూ రజినీకాంత్ 171వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

రజినీకాంత్ 171వ సినిమా తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఉందని గతంలోనే ప్రకటించారు. లోకేష్ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో తన సినిమాలపై హైప్ సృష్టించాడు. ఇప్పుడు రజినీకాంత్ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా? ఉండదా? అనేది తెలియదు కానీ లోకేష్ తో రజినీకాంత్ సినిమా అనగానే అభిమానులతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు.

Also Read : Suriya 44 : ‘కంగువ’ తర్వాత సూర్య నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా? హార్ట్ బ్రేక్ పోస్టర్ తో..

తాజాగా నేడు రజినీకాంత్ – లోకేష్ తలైవర్ 171వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ ని బంగారపు వాచ్‌లతో సంకెళ్లు వేసినట్టు ఉంది. రజినీకాంత్ ఓ విలనీ నవ్వుతో అదిరిపోయే లుక్ లో ఉన్నారు. పోస్టర్ వెనక కూడా వాచ్ ఉంది. దీంతో టైం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఇక తలైవర్ 171 సినిమా టైటిల్ ని ఏప్రిల్ 22న ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అభిమానులు రజిని కొత్త సినిమా టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రజినీకాంత్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.