×
Ad

Vijay- Rashmika: రష్మిక మమ్మల్ని పిలవదు.. రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ హాట్ కామెంట్స్

విజయ్- రష్మిక(Vijay- Rashmika)ల పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ హాట్ కామెంట్స్.

Rakshit Shetty friend hot comments on Vijay-Rashmika wedding.

Vijay- Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay- Rashmika)తో ఆమె వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరుగనుంది. ఈ పెళ్లి అతి కొద్ది మంది సమక్షంలో ఉదయపూర్ లో జరుగనుంది. ఈ పెళ్ళికి సంబదించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. దీంతో, ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్- రష్మికల పెళ్లి గురించే చర్చ నడుస్తోంది.

ఇక, ఈ నేపధ్యంలోనే రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. రష్మిక గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎగజ్మెంట్ బ్రేక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇద్దరు తమ తమ కెరీర్ లో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ విషయం గురించి ఇద్దరు ఎక్కడ కూడా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. కనీసం వల్ల ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా ఎవరు స్పందించలేదు.

Cult: మ్యూజిక్‌ డైరెక్టర్‌కు రోలెక్స్ గ్లోడ్ వాచ్ గిఫ్ట్‌ గా ఇచ్చిన విశ్వక్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

అయితే, తాజాగా రష్మిక మందన్న పెళ్లి వేళ రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి ఈ విషయంపై స్పందించాడు. రష్మిక పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. “నాకు రష్మిక పెళ్లికి ఇన్విటేషన్ రాలేదు. ఒకవేళ వస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, నాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం రక్షిత్ శెట్టి గురించి అతను మాట్లాడుతూ.. అతని గురించి, అతని కెరీర్ ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఆయనేమి చాక్లెట్లు తింటూ, మూలలో కూర్చుని బాధపడే చిన్న పిల్లాడు కాదు కదా. తన జీవితంపై, కెరీర్‌పై తనకు క్లారిటీ ఉంది. ప్రస్తుతం తను తన సినిమాలతో బిజీగా ఉన్నాడు”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రమోద్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.