Sapta Sagaralu Dhaati Review : సప్తసాగరాలు దాటి రివ్యూ.. కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ కల కోసం చేసిన తప్పు..

రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా 'సప్త సాగరడాచే ఎల్లో' అక్కడ హిట్ అవ్వగా అయి సినిమాని తెలుగులో 'సప్త సాగరాలు దాటి'(saptha sagaralu Dhaati) అనే పేరుతో రిలీజ్ చేశారు.

Rakshit Shetty Rukmini Vasanth Movie Sapta Sagaralu Dhaati Review and Audience Rating

Sapta Sagaralu Dhaati Review : ఇటీవల 777 చార్లీ సినిమాతో మెప్పించిన కన్నడ నటుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘సప్త సాగరడాచే ఎల్లో’ అక్కడ హిట్ అవ్వగా అయి సినిమాని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో రిలీజ్ చేశారు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా నటించింది. హేమంత్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. సప్త సాగరాలు దాటి సినిమా నేడు సెప్టెంబర్ 22న రిలీజ్ అయింది.

కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ కొత్తగా పెళ్లయిన జంట(హీరో – హీరోయిన్) చిన్న జాబ్స్ చేసుకుంటూ సిటీలో బతుకుతుంటారు. ఈ ఇద్దరికీ ఒక మంచి ఇల్లు సముద్రం పక్కన కట్టుకొని జీవితాంతం అక్కడే ఉండిపోవాలి అని కల ఉంటుంది. హీరోయిన్ కోసం ఆ కలని ఎలాగైనా తీర్చాలనుకొని హీరో ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని డబ్బుల కోసం ఒప్పుకొని త్వరగా బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ ఒప్పుకోకపోయినా జైలుకి వెళ్తాడు. కానీ కేసు ఒప్పుకోమని ఇచ్చిన వాళ్ళు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హీరో – హీరోయిన్స్ ఉంటారు. మరి హీరో బయటకి వచ్చాడా? హీరోయిన్ ఎన్ని రోజులు వెయిట్ చేసింది? కేసు ఇచ్చిన అతను చనిపోతే హీరో కేసుని ఎవరు వాదించారు? హీరో జైలులో ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలు షారుఖ్ ఖాన్‌కి చూపించాను.. అట్లీ కామెంట్స్

అయితే ఈ సినిమాకి రెండు పార్టులు ఉంటాయని ముందే చెప్పారు. దీంతో పార్ట్ 1 చివర్లో పార్ట్ 2 మీద ఆసక్తి కలిగించేలా తెరకెక్కించారు. సంగీతం, డైలాగ్స్, కెమెరా విజువల్స్ అన్ని బాగుంటాయి. సినిమా మొత్తం ఎక్కువగా జైలులోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉన్నా చివర్లో ఎమోషన్ తో మెప్పించాడు. కన్నడలో ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు ఇక్కడి ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందనే చెప్పవచ్చు. ఇటీవల కన్నడ సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా హీరో హీరోయిన్స్ సప్త సాగరాలు అనే కష్టాలు ఎలా దాటారు అనేదే సినిమా.

ట్రెండింగ్ వార్తలు