Rakul Preet Singh : ఖరీదైన కారుని కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..

తాజాగా రకుల్ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుని కొనుగోలు చేసింది. బెంజ్ లో మేబ్యాచ్ GLS మోడల్ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర దాదాపు 3 కోట్ల పైనే ఉంటుంది అని సమాచారం.

  • Published on- September 9, 2023 / 04:14 PM IST

Rakul Preet Singh buys costly Mercedes Benz Car video goes viral

Rakul Preet Singh :  టాలీవుడ్(Tollywood) లో కెరటం(Keratam) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అవుతున్న సమయంలో బాలీవుడ్(Bollywood) కి చెక్కేసింది. అక్కడ కూడా సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది రకుల్. ఇక బాలీవుడ్ లో నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడిన విషయం కూడా చెప్పింది.

ప్రస్తుతం జాకీ భగ్నానీ, రకుల్ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. మరో వైపు సినిమాలతో బిజీగా ఉండి బాగానే సంపాదిస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మరో ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇప్పటికే రకుల్ కి సొంతంగా మూడు కార్లు ఉన్నట్టు సమాచారం. తాజాగా రకుల్ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుని కొనుగోలు చేసింది. బెంజ్ లో మేబ్యాచ్ GLS మోడల్ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర దాదాపు 3 కోట్ల పైనే ఉంటుంది అని సమాచారం.

Gopichand 32 Movie Opening : శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ 32వ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం.. ఫొటోలు..

కొత్త కారు కొన్న రకుల్ అక్కడే షోరూమ్ లో పలువురికి స్వీట్స్ పంచింది. పలువురు అభిమానులు, నెటిజన్లు రకుల్ కి కంగ్రాట్స్ చెప్తుంటే కొంతమంది మాత్రం మరీ అంత ఖరీదు ఉన్న కారు ఎందుకు, నీ బాయ్ ఫ్రెండ్ కొనిచ్చాడా అని కామెంట్స్ చేస్తున్నారు.