Rakul Preet Singh : హైదరాబాద్‌లో రకుల్ ఫుడ్ బిజినెస్..!
ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వ్యాపారాల్లో రాణించే అతి కొద్ది మంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.
- Thota Vamshi Kumar
- Updated on- April 13, 2024 / 04:17 PM IST
Rakul Preet Singh Food Business in Hyderabad
ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వ్యాపారాల్లో రాణించే అతి కొద్ది మంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇప్పటికే ఆమె ఫిట్‌నెస్ వ్యాపారంలో ఉంది. హైదరాబాద్, వైజాగ్‌లలో F-45 పేరుతో జిమ్‌లను ఏర్పాటు చేసింది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్‌లకు వెలుతుంటారు.వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ రకుల్ పెట్టుబడులు పెట్టింది. తాజాగా మరో వ్యాపారంలో అడుగుపెట్టనుంది.
ఆమె ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించనుంది. హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో ఈ నెల 16న ఈ రెస్టారెంట్ ఓపెన్ కానుంది. ఇందులో తృణధాన్యాలతో చేసిన వంటకాలు లభించనున్నాయి. కాగా.. రెస్టారెంట్ ప్రారంభించడంపై రకుల్ ఆనందం వ్యక్తం చేసింది. అందరికీ న్యూట్రిషన్ అందించాలన్నదే తమ రెస్టారెంట్ లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఆరంభంలో ఫుడ్ శరీరానికి మాత్రమే కాదని, ఆత్మ(మనసు)కు కూడా అని చెప్పింది.
కాగా.. రకుల్ ఇటీవలే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత వ్యాపారాలపై రకుల్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
