Chiranjeevi : నేటి పాలిటిక్స్‌లో నాలాంటి వాడు అనర్హుడు.. ఇక బతికినంత కాలం సినిమాల్లోనే.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్..

ఆహా ఓటీటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరగగా ఈ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడారు.

Chiranjeevi : నేటి పాలిటిక్స్‌లో నాలాంటి వాడు అనర్హుడు.. ఇక బతికినంత కాలం సినిమాల్లోనే.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్..

Megastar Chiranjeevi Sensational Comments on Politics and Movies goes Viral

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ అవి వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు మెగాస్టార్. రాజకేయ నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు రాజకీయాలపై కామెంట్స్ కూడా చేస్తుంటారు చిరంజీవి. తాజాగా మరోసారి రాజకీయాలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఆహా(Aha) ఓటీటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరగగా ఈ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆ ఈవెంట్ వీడియో కంటెంట్ ని తాజాగా ఆహాలో రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడారు.

చిరంజీవి మాట్లాడుతూ.. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకెళ్తుండటంతో మరింత సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్ళాను. మనకు ఇంత ఇచ్చిన ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరు ప్రజా సేవకుడే. కాని సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను గబుక్కున పాలిటిక్స్ లో కాలు వేసి పొరపాటు చేసానని మళ్ళీ ఇటు వచ్చేసాను. పాలిటిక్స్ లో ఇంకొంచెం పెద్ద ఎత్తున సేవలు చేద్దామని వెళ్ళాను కానీ నేటి పాలిటిక్స్ లో నాలాంటి వాడు అనర్హుడు అనేది వాస్తవం. నేను అందులోకి వెళ్లి తొమ్మిదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అభిమానుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది. కాని తిరిగి వచ్చాక అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం, మీ గుండెల్లో చోటు అలాగే చూపించారు. ఇప్పటికి మీ ప్రేమ పొందుతున్నాను. ఇకపై బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను, ఓపిక ఉన్నంత కాలం మీకోసం సినిమాలు చేస్తాను అని అన్నారు. దీంతో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Makeup Man : ధర్మవరపు సుబ్రహ్మణ్యం అల్లుడు హీరోగా.. ‘మేకప్ మ్యాన్’ల కథతో తెరకెక్కుతున్న సినిమా..

ఇక ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉండగా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ జరుగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.