Makeup Man : ధర్మవరపు సుబ్రహ్మణ్యం అల్లుడు హీరోగా.. ‘మేకప్ మ్యాన్’ల కథతో తెరకెక్కుతున్న సినిమా..

సినీ పరిశ్రమలోని మేకప్ మ్యాన్ జీవితాల గురించి చెప్పే కథగా ఈ సినిమా రానుంది.

Makeup Man : ధర్మవరపు సుబ్రహ్మణ్యం అల్లుడు హీరోగా.. ‘మేకప్ మ్యాన్’ల కథతో తెరకెక్కుతున్న సినిమా..

Dharmavarapu Subrahmanyam Son in Law entry as Hero with Makeup Man Movie

Updated On : April 13, 2024 / 2:08 PM IST

Makeup Man : దివంగత నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎన్నో సినిమాలలో తన కామెడీతో మెప్పించారు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి హీరో రాబోతున్నాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి హీరోగా నేడు మేకప్ మ్యాన్ అనే సినిమా మొదలైంది. సినీ పరిశ్రమలోని మేకప్ మ్యాన్ జీవితాల గురించి చెప్పే కథగా ఈ సినిమా రానుంది.

అభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్ కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు దివాకర్ యడ్ల దర్శకత్వంలో ఈ మ్యాకప్ మ్యాన్ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రవి కుమార్ చౌదరి, నిర్మాతలు లయన్ సాయి వెంకట్, భరత్ పారేపల్లి.. పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read : NTR – Hrithik : ఇద్దరు టాప్ డ్యాన్సర్స్.. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ వేస్తే.. ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్‌తో..?

దర్శకుడు రవి కుమార్ చౌదరి హీరోపై క్లాప్ కొట్టగా, సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, భరత్ పారేపల్లి తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ అవుటూరి మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి మామయ్యను చూసి పెరగడంతో సినిమాలపై ఆసక్తి వచ్చింది. ఎక్కువగా కామెడీ సినిమాలు ఇష్టం. ఇప్పుడు ఇలాంటి ఓ మంచి కథతో హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఇక.. సినీ పరిశ్రమలో మేకప్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి మేకప్ మ్యాన్ ల జీవితాలు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ సమస్యలు ఈ సినిమాలో చూపించబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Dharmavarapu Subrahmanyam Son in Law entry as Hero with Makeup Man Movie