పార్టీలకు వెళ్లను.. మందు కొట్టను.. మేమిద్దరం కలిస్తే అవే పనులు..

  • Publish Date - August 23, 2020 / 07:40 PM IST

Rakul Preet,Lakshmi Manchu: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి మంచు ఇద్దరు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ స్నేహం గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడారు. మంచు లక్ష్మితో అనుబంధం గురించి మరోసారి రకుల్ స్పందించింది. తమ ఇద్దరిమధ్య ఉన్న స్నేహం గురించి, ఇద్దరూ కలిస్తే ఏం చేస్తారో ఏ విషయాల గురించి మాట్లాడుకుంటారో చెప్పుకొచ్చింది.



‘మంచు లక్ష్మి, నాది ఇద్దరి ఆలోచనా ధోరణి ఒకే విధంగా ఉంటుంది. మేం ఎక్కువగా ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకుంటాం. బోలెడన్ని సినిమాలు చూస్తాం. వర్కవుట్స్ చేస్తాం. నేను పార్టీలకు వెళ్లను. మందు కొట్టను. లక్ష్మి, నేను కలిసి ట్రెక్కింగ్‌కు, సైక్లింగ్‌కు వెళ్తాం. కలిసి వంట చేసుకుంటాం. ఈ కరోనా సమయంలో నేను లక్ష్మిని తప్ప మరొకరిని కలవలేదు. నేను బయటకెళ్తే లక్ష్మి ఇంటికే వెళ్లేదాన్ని’ అని రకుల్ ప్రీత్ చెప్పింది.