Peddi: ‘పెద్ది’తో లాంగ్ డ్రైవ్.. రామ్ చరణ్, బుచ్చిబాబు స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్ 'పెద్ది(Peddi)' స్పెషల్ ఇంటర్వ్యూ.
- V Santhosh Kumar
- Updated on- May 15, 2026 / 09:21 AM IST
ram charan and buchibabu sana long drive peddi interview
-
చరణ్‌తో బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్.
-
సోషల్ మీడియాలో వీడియో వైరల్.
-
జూన్ 4న పెద్ది విడుదల.
Peddi: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (RC16)పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు స్వయంగా ఒక లాంగ్ డ్రైవ్ వీడియోను షేర్ చేస్తూ, “నేను లాంగ్ డ్రైవ్‌కు వచ్చాను.. నన్ను ఎవరు తీసుకువచ్చారో తెలుసా?” అంటూ కెమెరాను పక్కకు తిప్పి డ్రైవింగ్ సీట్లో ఉన్న రామ్ చరణ్‌ను చూపించారు. ఈ సరదా వీడియో మెగా అభిమానుల్లో జోష్ నింపింది.
Alia Bhatt: అలియా భట్ ‘అతి’ వాగుడు.. ఇండియన్ సినిమాను తక్కువ చేస్తూ.. మండిపడుతున్న నెటిజన్స్
రామ్ చరణ్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ బుచ్చిబాబుతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం చూస్తుంటే, వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతోంది. సినిమా రిలీజ్ టెన్షన్ మధ్య ఒక వ్యక్తి ఇలా లాంగ్ డ్రైవ్ కి తీసుకొచ్చారు. ఆయనే రామ్ చరణ్ అంటూ చూపించారు. దానికి రామ్ చరణ్.. ఇవన్నీ కాదు మన సినిమా ఎప్పుడు వస్తుంది అది చెప్పు అన్నాడు. ఇలా చాలా సరదాగా సాగింది ఈ వీడియో. అయితే, ఇది స్పెషల్ ఇంటర్వ్యూగా రానుందట. అది కూడా ఇవాళే విడుదల అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. వీరిద్దరూ ఇలా చిల్ అవుతున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం కొద్ది నిమిషాలపాటు సాగిన ఈ వీడియో
నెట్టింట వైరల్ గా మారింది.
సినిమా అవుట్‌పుట్ విషయంలో బుచ్చిబాబు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా భారీ ప్రమోషన్లకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ‘పెద్ది(Peddi)’ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రమోషన్స్ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు, ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ కలిసి వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమనిపిస్తోంది.
