×
Ad

Ram Charan : అంబానీ ఇంట పెళ్ళికి రామ్ చరణ్..? టాలీవుడ్ నుంచి ఒక్కడే..

ప్రస్తుతం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ - రాధికా పెళ్లి వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు.

  • Published On : July 11, 2024 / 06:51 AM IST

Ram Charan and Upasana Will Attend to Anant Ambani Radhika Merchant Marriage in Mumbai

Ram Charan : ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ అని రెండు సార్లు, పెళ్ళిలో హల్దీ, సంగీత్, రిసెప్షన్.. ఇలా బోలెడన్ని సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకుంటున్నారు అనంత్ – రాధికా జంట. ఇప్పటికే అనంత్ అంబానీ – రాధికా పెళ్లి వేడుకలకు అనేక మంది సెలబ్రిటీలు వస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా, రాజకీయ, బిజినెస్ ప్రముఖులు వచ్చి సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ – రాధికా పెళ్లి వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ హాజరు కాబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ – ఉపాసన కలిసి నేడు గురువారం రోజున సతీసమేతంగా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్ళికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ నుంచి ఈ వేడుకలకు చరణ్ ఒక్కడే హాజరు కాబోతున్నట్టు సమాచారం.

Also Read : Mahesh Babu Family : జర్మనీ వెకేషన్ నుంచి మహేష్ ఫ్యామిలీ పిక్ చూశారా?

గతంలో కూడా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ కి రామ్ చరణ్ – ఉపాసన కలిసి హాజరయ్యారు. అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కడే వెళ్లడం గమనార్హం. అప్పుడు చరణ్ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి డ్యాన్స్ వేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. RRR తర్వాత చరణ్ బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడం, నార్త్ లో బాగా పాపులారిటీ రావడం, చిరంజీవి పలుకుబడి కూడా ఉండటం, బాలీవుడ్ లోని పలు ఈవెంట్స్ కి చరణ్ హాజరవ్వడంతో చరణ్ నార్త్ లో ఫుల్ ఫేమస్ అయ్యాడు. గతంలో అనిల్ అంబానీ కూడా అయోధ్యలో చరణ్ ని కలిసి మాట్లాడారు. మొత్తానికి అంబానీ ఇంట పెళ్ళికి చరణ్ వెళ్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.