Mahesh Babu Family : జర్మనీ వెకేషన్ నుంచి మహేష్ ఫ్యామిలీ పిక్ చూశారా?

తాజాగా మహేష్ బాబు జర్మనీ వెకేషన్ లో దిగిన ఫ్యామిలీ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Mahesh Babu Family : జర్మనీ వెకేషన్ నుంచి మహేష్ ఫ్యామిలీ పిక్ చూశారా?

Mahesh Babu Shares his Family Photo in Social Media from Germany Vacation

Updated On : July 11, 2024 / 6:33 AM IST

Mahesh Babu Family : మహేష్ బాబు రెగ్యులర్ గా ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ కి వెళ్తారని తెలిసిందే. ఇటీవలే లండన్, జర్మనీకి వెళ్లొచ్చారు మహేష్ ఫ్యామిలీ. దాదాపు రెండు వారాలు విదేశాల్లోనే ఉండి రెండు రోజుల క్రితమే తిరిగొచ్చారు మహేష్ ఫ్యామిలీ. ఇప్పటికే లండన్, జర్మనీ వెకేషన్ కి సంబంధించి నమ్రత, సితార పలు ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. తాజాగా మహేష్ బాబు జర్మనీ వెకేషన్ లో దిగిన ఫ్యామిలీ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Also Read : Thangalaan Trailer : ‘తంగ‌లాన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. విక్ర‌మ్ న‌ట‌న నెక్ట్స్ లెవల్‌..

మహేష్ బాబు, నమ్రత, సితార, గౌతమ్ నలుగురు ఉన్న ఫోటోని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి..మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన సమయం గడిపాము అంటూ మహేష్ ఫ్యామిలీ ఉన్న హోటల్ ని, అతిథ్యం ఇచ్చిన ఓ డాక్టర్ ని ట్యాగ్ చేశారు. దీంతో మహేష్ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఇక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా సరికొత్త లుక్ లోకి మారుతున్నాడు. సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతున్నా ఇంకా అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేకపోవడం, అసలు సినిమా మొదలుపెట్టకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.