Ram Charan : ముంబైలో రామ్ చరణ్.. జెనీలియా, సల్మాన్ తో స్పెషల్ పార్టీ.. గ్రూప్ ఫోటో వైరల్..
చరణ్ ముంబై కి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తుంది.(Ram Charan)
- Saketh U
- Published on- May 10, 2026 / 09:40 AM IST
Ram Charan
Ram Charan : రామ్ చరణ్ ఇటీవలే పెద్ది సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ముంబై వెళ్లి వచ్చారు. చరణ్ ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఎయిర్ పోర్ట్ విజువల్స్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విజువల్స్ లో చరణ్ అదిరిపోయే లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే చరణ్ ముంబై కి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తుంది. తాజాగా హీరోయిన్ జెనీలియా ఓ గ్రూప్ ఫోటోని షేర్ చేసింది. ఇందులో రామ్ చరణ్ ఉన్నారు. జెనీలియా, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, అర్పిత శర్మ, కంచి కౌల్, షబీర్ అహుల్వాలియా.. ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. గ్యాంగ్ అంటూ జెనీలియా ఈ స్పెషల్ ఫోటోని షేర్ చేసింది.
Also Read : Anchor Sravanthi : అమ్మను తలుచుకుంటూ.. యాంకర్ స్రవంతి మదర్స్ డే ఎమోషనల్ పోస్ట్..
గతంలో రామ్ చరణ్, జెనీలియా కలిసి ఆరెంజ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ మళ్ళీ కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక సల్మాన్ ఖాన్ చిరంజీవి ఫ్యామిలీకి చాలా సన్నిహితుడని తెలిసిందే.
