Hellallallo Song: హెల్లల్లల్లో సాంగ్ పై తీవ్రమైన ట్రోలింగ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
హెల్లల్లల్లో సాంగ్ పై వస్తున్న ట్రోలింగ్ కి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.
- V Santhosh Kumar
- Updated on- May 31, 2026 / 08:59 PM IST
Ram Charan Clarifies about Hellallallo Song Trolling
- ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల.
- పాట వివాదంపై రామ్ చరణ్ క్లారిటీ.
- అసభ్యంగా చూపించే ఉద్దేశం మాకు లేదు.
Hellallallo Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Anchor Sreemukhi: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ శ్రీముఖి.. డివోషనల్ ఫోటోలు వైరల్
అయితే, విడుదల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ చిత్రంలోని ‘హెల్లల్లల్లో’ సాంగ్(Hellallallo Song) ఉత్తరాదిలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలో రామ్ చరణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు కాస్త అసభ్యంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ ఈ వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘నాటు నాటు’ సాంగ్‌ను తాను ఎంతలా ఆస్వాదించానో, ఈ పాటలో శృతిహాసన్, జాన్వీ కపూర్‌లతో కలిసి అంతే ఎనర్జీతో స్టెప్పులేశానని చరణ్ స్పష్టం చేశారు. ఈ రెండు పాటలను తాను వేరుగా చూడనని చెప్పారు. ప్రేక్షకులను అసభ్యంగా చూపించాలనే ఉద్దేశం తమకు అస్సలు లేదని, అలాంటప్పుడు ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చరణ్ గట్టిగా బదులిచ్చారు.
