×
Ad

Ram Charan : పంజాబ్ లో RC15 షూట్.. RRR ఎఫెక్ట్.. చరణ్‌తో ఫోటోల కోసం పంజాబ్ పోలీసుల క్యూ..

తాజాగా పంజాబ్ లో RC15 నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. షూటింగ్ కోసం చరణ్ పంజాబ్ కి వెళ్లారు. అయితే చరణ్ కి 'ఆర్ఆర్ఆర్'తో నార్త్ లో క్రేజ్ బాగా రావడంతో చరణ్ షూటింగ్ కి వచ్చారని......

  • Published On : April 16, 2022 / 09:25 PM IST

Ram Charan

Ram Charan :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో నార్త్ లో చరణ్, తారక్ లకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. సినిమాలో చరణ్ ని అల్లూరి సీతారామరాజులా చూపించారు రాజమౌళి. అయితే కొన్ని సీన్స్ లో కాషాయ వస్త్రాల్లో ఉంది బాణాలు పట్టుకోవడంతో రాముడిలా కనపడ్డారంటూ నార్త్ లో ఏకంగా చరణ్ కి థియేటర్లలోనే పూజలు కూడా చేసేశారు. ఆ సీన్స్ తో చరణ్ కి ఒక్కసారిగా నార్త్ లో అభిమానాలు పెరిగిపోయారు. ఇప్పుడు చరణ్ నార్త్ వెళితే ఫోటోల కోసం కచ్చితంగా ఎగబడతారు అక్కడి జనాలు. తాజాగా అదే జరిగింది.

చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో షూట్ ని పూర్తి చేశారు. తాజాగా పంజాబ్ లో RC15 నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. షూటింగ్ కోసం చరణ్ పంజాబ్ కి వెళ్లారు. అయితే చరణ్ కి ‘ఆర్ఆర్ఆర్’తో నార్త్ లో క్రేజ్ బాగా రావడంతో చరణ్ షూటింగ్ కి వచ్చారని తెలిసి అక్కడి ప్రజలు చాలా మంది చరణ్ తో ఫోటోల కోసం ఎగబడ్డారు. దీంతో పంజాబ్ పోలీసులతో షూటింగ్ ప్లేస్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Alia Ranbir : ఆలియా రణబీర్ పెళ్లి.. బయటకొచ్చిన మరిన్ని ఫోటోలు..

 

అయితే షూటింగ్ గ్యాప్ లో పంజాబ్ పోలీసులు కూడా రాంచరణ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. లేడీస్, జెంట్స్ అని సంబంధం లేకుండా పోలీసులంతా చరణ్ తో సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. దీంతో చరణ్ తో పంజాబ్ పోలీసులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ బాగా వచ్చింది. తన తర్వాతి సినిమాలకి ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.