Ram Charan: ఆ విషయంలో నాన్నే ఇన్స్పిరేషన్.. తండ్రిపై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్
ఈ స్క్వైర్ ఇండియా ఇంటర్వ్యూలో తన తండ్రి చిరంజీవి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్(Ram Charan).
- V Santhosh Kumar
- Published on- April 17, 2026 / 06:48 AM IST
ram charan emotional comments about his father chiranjeevi at esquire india interview
- నా జీవితంలో రియల్ హీరో నాన్నే
- మెగాస్టార్ క్రమశిక్షణే నాకు స్ఫూర్తి
- ‘ఈ స్క్వేర్ ఇండియా’ ఇంటర్వ్యూలో చరణ్ కామెంట్స్
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. కానీ, ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ దీనిని జూన్‌కు వాయిదా వేశారు. ఒకవైపు సినిమా పనులతో బిజీగా ఉంటూనే, చరణ్ మరో అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రతిష్టాత్మక ‘ఈ స్క్వేర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై చోటు సంపాదించిన టాలీవుడ్ హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.
Niharika Konidela: నిహారిక కొణిదెల ‘బ్లాక్ మ్యాజిక్’.. హాఫ్ శారీలో అదరగొట్టిన బ్యూటీ
ఈ సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (Ram Charan)తన వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై తండ్రి చిరంజీవి ప్రభావాన్ని గుర్తు చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో నిజమైన హీరో అని రామ్ చరణ్ గర్వంగా చెప్పుకొచ్చారు. నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం తమకు సులభంగా అనిపించినా, ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనిదని అన్నారు. షూటింగ్‌ల కోసం రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారని, అయినా సరే కుటుంబం కోసం సమయాన్ని కేటాయించే విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని వెల్లడించారు.
ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా ఇంట్లో సాదాసీదా తండ్రిలాగే ఉండటం ఆయనకే సాధ్యమని, కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీ వ్యక్తులకు అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలను, కుటుంబ బంధాలను ఎలా సమన్వయం చేసుకోవాలో తండ్రిని చూసే నేర్చుకున్నానని చరణ్ తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగే చిరంజీవి తత్త్వం తనపై ఎంతో ప్రభావం చూపిందని, ఇప్పుడు తను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నానని స్పష్టం చేశారు. మూడు రోజులు విరామం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే తండ్రి క్రమశిక్షణే తనకు స్ఫూర్తి అని చెర్రీ పేర్కొన్నారు. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
