Ram Charan: ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్ రా మావా.. ఆరంజ్ తో హారతి.. కాంపా డ్రింక్ తో అభిషేకం
ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ అవుతున్న థియేటర్ల వద్ద రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్స్.
- V Santhosh Kumar
- Published On : February 7, 2026 / 03:50 PM IST
Ram charan fans mass celebrations at orange movie re release theaters
- ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఆరంజ్ మూవీ రీ రిలీజ్
- థియేటర్స్ దగ్గర మాస్ సెలబ్రేషన్స్ చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్
- ఆరంజ్ తో హారతి.. కాంపా డ్రింక్ తో అభిషేకం చేస్తున్న వీడియోలు వైరల్
Ram Charan: ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ క్రేజ్ ఇంటర్నేషనల్ లెవల్ కి చేరుకుంది. ఇక ఇండియాలో ఆయన ఫ్యాన్స్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ ఆయ్యాయంటే ఆ హంగామా మాములుగా ఉండదు. అయితే, తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర మాస్ లెవల్లో సెలబ్రేషన్స్ చేశారు. అది కూడా వినూత్న రీతిలో
అదేంటి, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలేవీ రిలీజ్ లేదు కదా. మరి థియేటర్స్ దగ్గర హంగామా ఏంటా అనుకుంటున్నారా. అయితే, రామ్ చరణ్(Ram Charan) నటించిన సినిమాలలో మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా ఏదైనా ఉందంటే అది ఆరంజ్ అనే చెప్పాలి. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆ టైంలో ప్లాప్ అయ్యింది. కానీ, ఇప్పుడు యూత్ అంతా కల్ట్ క్లాసిక్ అంటూ ఆకాశానికెత్తేస్తారు.
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఆరంజ్ సినిమాను కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో, ఆరంజ్ సినిమా రీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. వినూత్నంగా ఆరంజ్(కమల పండు) తో దిష్టి హారతులు ఇస్తూ.. కాంపా కూల్ డ్రింకులతో రామ్ చరణ్ కి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ కాంపా కూల్ డ్రింక్ నే వాడటానికి రీసన్ ఏంటంటే, రామ్ చరణ్ ఈ డ్రింక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
అందుకే ఆ కూల్ డ్రింకులతో రామ్ చరణ్ కు అభిషేకం చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్. దీనికి సంబదించిన వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇవెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
