Game Changer : హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..

తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.

  • Updated on- August 7, 2024 / 12:38 PM IST

Ram Charan Game Changer Movie Update by Movie Unit

Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఫ్యాన్స్ అంతే నిరుత్సాహంలో కూడా ఉన్నారు ఈ సినిమాపై. సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి అప్డేట్స్ లేవని ఇన్ని రోజులు ఎదురుచూసారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇన్ని రోజులు షూటింగ్ కూడా అవ్వలేదని బాధపడగా ఇటీవలే గేమ్ ఛేంజర్ షూట్ పూర్తయిందని సమాచారం. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ నేడు మొదలుపెట్టినట్టు ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. షూట్ అయిపొయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ త్వరగానే పూర్తిచేసి డిసెంబర్ లో సినిమా రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్.

Also See : Ileana Son : ఇలియానా కొడుకు ఫస్ట్ బర్త్ డే ఫోటోలు చూశారా..?

డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టిన ఫోటోలు షేర్ చేసి రిలీజ్ క్రిస్మస్ కి అని మరోసారి క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేయగా నెక్స్ట్ సాంగ్ ఆగస్టు చివర్లో వస్తుందని ఇటీవల థమన్ ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు.