×
Ad

Game Changer : సినిమా రిలీజ్ అవ్వకుండానే భారతీయుడు 2లో.. రామ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్..

సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక పాట వినిపిస్తుంది. ఈ సినిమాలో కూడా ఓ సన్నివేశంలో రెండు పాటలు వస్తాయి.

  • Published On : July 12, 2024 / 04:29 PM IST

Ram Charan Game Changer Song Played in Kamal Haasan Bharateeyudu 2 Movie

Game Changer : కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి సందడి చేస్తుంది. మొదటి పార్ట్ అంత గొప్పగా లేకపోయినా ఓకే అనిపించింది ఈ సినిమా. కమల్ హాసన్ మాత్రం తన నటనతో 100 ఏళ్ళు పైబడిన ముసలివాడిగా అదరగొట్టేసాడు. అయితే ఈ సినిమాలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకా రిలీజ్ అవ్వని గేమ్ ఛేంజర్ సినిమా సాంగ్ ప్లే చేయడం గమనార్హం.

సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక పాట వినిపిస్తుంది. ఈ సినిమాలో కూడా ఓ సన్నివేశంలో రెండు పాటలు వస్తాయి. తమిళ్ లో ఆ సీన్ లో ఏ సాంగ్స్ పెట్టారో తెలీదు కానీ తెలుగులో మాత్రం గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ తో పాటు గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి జరగండి.. సాంగ్ ప్లే చేసారు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Balakrishna : బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవ సంబరాలు.. అటు అభిమానులు.. ఇటు సినీ పరిశ్రమ..

చరణ్ – శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ చాలా లేట్ అయిన సంగతి తెలిసిందే. అభిమానులు ఈ సినిమా విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ తప్ప ఇంకెలాంటి అప్డేట్ లేదు. అసలు సినిమానే రిలీజ్ అవ్వకుండా ఆ పాట భారతీయుడు 2 తెలుగు వర్షన్ లో ప్లే చేయడంతో చరణ్ అభిమానులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. అయితే అది కూడా శంకర్ సినిమాలోని సాంగ్ అని ప్లే చేసి ఉంటారు అనుకుంటున్నారు. ఇక ప్లే చేసిన రెండు పాటలు తమన్ కంపోజ్ చేసినవి కావడం గమనార్హం. కానీ ఈ విషయంలో మాత్రం కమల్ హాసన్ సినిమాలో చరణ్ సాంగ్ ప్లే చేసారని అభిమానులు సంతోషిస్తున్నారు.