Ram Charan: ‘ఉప్పెన’ ట్విస్ట్‌ కంటే 100 రెట్లు.. క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సీక్రెట్ లీక్ చేసిన రామ్ చరణ్!

పెద్ది సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్(Ram Charan).

Ram Charan gave a hint about the climax twist in Peddi movie

  • ‘పెద్ది’ సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ అద్భుతం
  • ‘ఉప్పెన’ కంటే వందరెట్లు పెద్ద ట్విస్ట్
  • జూన్ 4న సినిమా గ్రాండ్ రిలీజ్

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వినూత్నంగా నిర్వహిస్తోంది. తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ ముచ్చటించిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Peddi: నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా.. ఆ నొప్పి తెలుస్తోంది.. పెద్ది కోసం ప్రాణం పెట్టిన రామ్ చరణ్

ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు “సినిమా మొత్తంలో మీకు ఇష్టమైన ఎపిసోడ్ ఏది?” అని అడగ్గా, రామ్ చరణ్(Ram Charan) ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో వచ్చే ‘ఢిల్లీ ఎపిసోడ్’ తనకు అత్యంత ఇష్టమైన భాగమని చరణ్ వెల్లడించారు. కథ పరంగా ఈ ఎపిసోడ్‌లో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని, సినిమాలోనే ఇది అత్యంత కీలకమైన ఘట్టమని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఈ ఢిల్లీ ఎపిసోడ్ గురించి చెబుతూ.. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ‘ఉప్పెన’లోని క్లైమాక్స్ ట్విస్ట్‌తో చరణ్ పోల్చారు. ఉప్పెన సినిమాలో వచ్చే ట్విస్ట్‌ కంటే 100 రెట్లు ఎక్కువ షాకింగ్ ట్విస్టులు ఈ ఢిల్లీ ఎపిసోడ్‌లో ఉంటాయని చరణ్ అనడంతో మెగా అభిమానుల్లో అంచనాలు స్కై హైకి చేరాయి. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ‘పెద్ది’ సినిమాలో ఊహించని మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.