Ram Charan Vaazha: చిన్న సినిమాకు మెగా సపోర్ట్.. ‘వాలా 2’ టీంపై రామ్ చరణ్ ప్రశంసలు

Ram Charan Vaazha Team: వాలా 2 మూవీ టీమ్ కి సపోర్ట్ గా నిలిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).

Ram Charan met vazha 2 movie team on the sets of Peddi

Ram Charan: మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వాళా 2’ (Vaazha 2) చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వచ్చేసింది. కేరళ బాక్సాఫీస్ వద్ద కేవలం 17 రోజుల్లోనే రూ.200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, అర్చన తమ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై తెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ‘పెద్ది’ సెట్స్‌లో కలిశారు. ఈ సందర్భంగా చరణ్ వారితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సినిమాకు తన మద్దతును ప్రకటించారు.

*పొలం పనులు చేస్తున్న బిగ్ బాస్ ఇనయా సుల్తానా.. ఫోటోలు చూశారా?

మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నందుకు చరణ్(Ram Charan) సంతోషం వ్యక్తం చేశారు. సాహు గారపాటి, అర్చనలు ఈ వైవిధ్యమైన కథను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు చూపిస్తున్న ఆసక్తిని ఆయన అభినందించారు. అలాగే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కీలక వ్యక్తి విపిన్ దాస్, దర్శకుడు సావిన్ ఎస్.ఏ, చిత్రంలోని యువ నటీనటులందరికీ చరణ్ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. రామ్ చరణ్ మద్దతు లభించడంతో ఈ చిన్న సినిమాపై ఇప్పుడు తెలుగునాట భారీ హైప్ క్రియేట్ అయింది.

వాలా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం, యువత ఎదుర్కొనే సవాళ్లు, స్నేహం నేపథ్యంలో సాగే ఒక ఎనర్జిటిక్ ఎంటర్టైనర్. ఇప్పటికే హైదరాబాద్ వంటి నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించగా, వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం, మలయాళంలో లాగే తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.