Ram Charan: నేను ‘రఫ్ అండ్ టఫ్’ డాడీని.. పిల్లల గురించి రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.
తన ముగ్గురు పిల్లల గురించి చెప్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్(Ram Charan).
- V Santhosh Kumar
- Published on- April 14, 2026 / 03:36 PM IST
Ram Charan Opens Up About Fatherhood, Says He Is A Rough Dad To His 3 Kids
- ఎస్క్వైర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు.
- తన ముగ్గురు పిల్లలే తన ప్రపంచమన్న రామ్ చరణ్
- పిల్లలు లేకపోతే ఇల్లు వెలవెలబోతుందట
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన బాధ్యతలను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తండ్రిగా తన అనుభవాలను పంచుకున్నారు. తన ముగ్గురు పిల్లలు క్లిన్ కారా, అన్వీరా, శివరామ్ తన ప్రాణమని, వారు ఇంట్లో లేకపోతే ఆ వెలితి స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. తన భార్య ఉపాసన పిల్లలకు ప్రేమను, సంరక్షణను అందిస్తే, తాను మాత్రం వారిని సాహసాల వైపు నడిపిస్తూ, ధైర్యాన్ని నూరిపోసే ‘రఫ్ అండ్ టఫ్’ తండ్రిగా ఉంటానని చరణ్(Ram Charan) ఆసక్తికరంగా వివరించారు. పిల్లల ఎదుగుదలలో నిరంతరం తోడుగా ఉండే తండ్రిగా ఉండటమే తన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.
Mouli: మౌళి హీరోగా ‘దొంగనా కొడుకు’ .. మైత్రీ మూవీస్ నిర్మాణంలో పక్కా కామెడీ ఎంటర్టైనర్.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో ‘పెద్ది పెహిల్వాన్’గా చరణ్ తన బాడీ మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. కుస్తీ పోటీలు, ఇసుక బస్తాలతో కఠినమైన శిక్షణ చేస్తున్న దృశ్యాలు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో చరణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతమైన రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఒక సామాన్య వ్యక్తి అసాధారణమైన పెహిల్వాన్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రిగా పిల్లలతో గడుపుతూనే, నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని పెచుతున్నాడు రామ్ చరణ్. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
