Ram Charan : ‘ఆరెంజ్’ పాటలకి ఇంతటి క్రేజ్ ఉందా..? ఈ వైరల్ వీడియో చూశారా..!
వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే 'ఆరెంజ్' పాటలకి ఇంతటి క్రేజ్ ఉందా..? అని ఆశ్చర్యపోతారు.
- gum 95921
- Published On : February 17, 2024 / 03:37 PM IST
Ram Charan orange movie songs craze video gone viral
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటించారు. 2010లో రిలీజైన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అప్పటి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన ఆ చిత్రం.. ఆ తరువాత జనరేషన్ ఆడియన్స్ ని మాత్రం బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పటి యూత్ కి ఈ సినిమా ఫేవరెట్ లిస్టులో ఉంటుంది.
ముఖ్యంగా ఈ మూవీలోని పాటలు, డైలాగ్స్.. ఈ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఎంతలా అంటే, ఇటీవల ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే.. 2010లో విడుదల సమయం కంటే ఎక్కువ సందడి ఈ రీ రిలీజ్ లో కనిపించింది. అది చూసి మూవీ నిర్మాత నాగబాబు, డైరెక్టర్ భాస్కర్.. అందరూ షాక్ అయ్యారు. అయితే తాజాగా జరిగిన ఓ విషయం మరోసారి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఏం జరిగింది..?
Also read : OoruPeru Bhairavakona : సందీప్ కిషన్ ‘ఊరుపేరు భైరవకోన’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రీసెంట్ గా వైజాగ్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్ లో స్టేజి పై ఉన్న సింగర్ కార్తీక్.. ఆరెంజ్ మూవీలోని ‘చిలిపిగా చూస్తావల’ అనే సాంగ్ ని పడబోతున్నట్లు తెలియజేశారు అంతే.. ఇంకేముంది స్టేజి కింద ఉన్న ఆడియన్స్ ఆ పాటని పాడడం మొదలు పెట్టేశారు. స్టేజి పై పాట పడాల్సిన కార్తీక్‌ని.. ఏం జరుగుతుందో తెలియక షాక్ తో ఆడియన్స్ పాడుతున్న పాటని ఆలపిస్తూ నిలుచొని ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Music Aapi Dengadu Concert lo ?@AlwaysRamCharan ❤️? pic.twitter.com/jXg4N0IZH3
— Raees (@RaeesHere_) February 16, 2024
ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. ఆరెంజ్ కి మరింతా క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హరీశ్ జయరాజ్ సంగీతం అందించారు. మూవీలో ఏడు సాంగ్స్ ఉంటే.. ఏడు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటి జనరేషన్ యూత్ లోని ప్రతిఒక్కరి మ్యూజిక్ లిస్టులో ఈ ఆల్బమ్ తప్పకుండా ఉంటుంది.
